Guppedantha Manasu 6 July Today Episode : నీ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి నాకేం పనిలేదు అనుకుంటున్నావా అని రిషి వసుధార మాట్లాడుకుంటుంటారు. మహేంద్రతో జగతి అస్సలు వసుధార రిషి దగ్గరికి ఎందుకు వచ్చిందో చెప్పిందా అని అంటుంది.మహేంద్ర రిషిని సాక్షి దగ్గర రక్షించడానికి వచ్చిందేమో నేను కూడా అందుకే వెళ్లాను అని మహేంద్ర అంటాడు. రిషి ఎందుకో కానీ బ్యాలెన్సుడుగా ఉంటున్నాడు అని మహేంద్ర జగతి తో అంటాడు. తర్వాత రిషి వెళ్లిపోతాడు, జగతి వసుధార తో లంచ్ చేద్దాం అని అంటుంది. వసుధార అప్పుడేనా మేడం అంటుంది, జగతి అదేంటి వసుధార నువ్వు తినవా అంటే, రిషి సార్ లంచ్ చెయ్యకుండా వెళుతున్నారు ఏంటి అని ఆలోచిస్తున్నాను అంటోంది.
అయితే వెళ్ళి పిలవమంటావా అందరూ కలిసి లంచ్ చేద్దాం అని జగతి అంటోంది. ఇప్పటికే రిషి సార్ నా మీద కోపంగా ఉన్నారు మేడం అంటుంది. ఈ సార్ కోపం, నీ ప్రాబ్లమ్ మాకెందుకులే అని జగతి అంటుంది. లాంచ్ చేస్తూ మేడం రిషి సార్ ఏంటి లంచ్ టైమ్ కి బయటికి వెళుతున్నారు మీరైనా చెప్పొచ్చుగా అని వసుధార అంటుంటే, రిషి వస్తాడు. డాడ్ అని పిలవగానే రిషి రా లంచ్ చేద్దాం అంటే లేదు నేను వెళ్తాను కార్ కీస్ ఇవ్వండి అని అంటాడు. సార్ మీ కారు ఏమైంది అని వసుధార రిషిని అడుగుతుంది, నా కారులో పెట్రోల్ అయిపోయింది. మీరు తినండి డాడ్ అని అంటాడు. రిషి వెళ్తూ వెళ్తూ మేడమ్ మీ స్టూడెంట్ కి ఈమధ్య కొన్ని అర్థంపర్థంలేని వర్క్స్ చేస్తుంది.
కాస్త చెప్పండి కాలేజ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ తనకు అవసరం లేవు అని చెప్పండి అని రిషి సార్ జగతి తొ చెప్తాడు. ఇంతలో ఫోన్ వస్తే రిషి అక్కడినుండి వెళ్ళిపోతాడు మేడం నేను ఏం చేశానని అని వసుధార అంటుంది. ఎండీ గారు చెప్పారు కదా వసు అది చెయ్యడం నా పని అని అంటుంది జగతి, అవును వసుధార స్టేజ్ మీద అందరి ముందు ఎమ్డిగారి మెడలో దండ ఎలా వేయగలిగావు అని మహేంద్ర అడుగుతాడు, ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ మాట్లాడుతుంటే రిషి సార్ వస్తారు అని చెప్పి ఆ టాపిక్ నుంచి తప్పించుకుంటుంది వసుధార తర్వాత చూస్తే రిషి వెళ్ళింది సాక్షి దగ్గరికి సాక్షి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, డాక్టర్ చూసి ప్రమాదం తప్పింది అని చెప్పి వెళ్తుంది.
Guppedantha Manasu 6 July Today Episode : సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సాక్షి
పెద్దమ్మ సాక్షికి ఏమైంది అని రిషి అడుగుతాడు, ఇంట్లోవాళ్లు పేరెంట్స్ కూడా లేరు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అని దేవయాని అంటుంది. ఎందుకు పెద్దమ్మా అని రిషి అడుగుతాడు ప్రేమ నువ్వంటే ప్రేమ రిషి నువ్వంటే పిచ్చి ప్రాణం పాపం మొదట్లో నిన్ను కాదు అనుకుని వెళ్ళింది నువ్వే జీవితం అనుకుని తిరిగి నీ కోసం వచ్చింది. తను వెళ్లడం మీకు నచ్చలేదు, రావడం నీకు నచ్చలేదు అన్నీ తను నీకోసమే చేసింది అని దేవయాని అంటోంది, నేను కాదు అంటే ఇలా చేస్తుందా అని రిషి దేవయానితో అంటాడు మరి తను ఏం చేస్తుంది రిషి వాళ్ల పేరెంట్స్తో ఇంటికొచ్చి, చివరికి లైబ్రరీలో నిన్ను బ్లాక్ మెయిల్ చేసింది.
ఇక నువ్వు తనకు దక్కవు అని తెలిసిపోయిందేమో అందుకే సాక్షి ఇలా చేసిందేమో అని దేవయాని రిషితో చెప్తుంది. అలా దేవయాని తన మాటలతో రిషి ని సాక్షి తో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. దానికి రిషి ఒప్పుకోడు పెద్దమ్మ నా మనసులో మాట ఎప్పుడో చెప్పాను నన్ను బలవంతం పెట్టొద్దు అని రిషి దేవయాని తో అంటాడు సరే రిషి నీ నిర్ణయం మార్చుకోకు కానీ సాక్షి ని ఒక ఫ్రెండ్లాగా చూడు అని అంటుంది దేవయాని, ఒక మాట మాట్లాడితే సంతోషిస్తుంది అని దేవయాని రిషితో అంటుంది. ఎలాగో అలాగ నచ్చజెప్పి తనని అమెరికా పంపిస్తా అప్పటివరకు సాక్షితో మంచిగా మాట్లాడు అని దేవయాని రిషి తో అంటుంది. రిషి విని వెళ్లిపోతాడు, కానీ అసలు అదంతా ఒక డ్రామా సాక్షి, దేవయాని ఇద్దరూ కలిసి డ్రామా చేస్తారు.
అసలు సాక్షి సూసైడ్ చేసుకోదు. తర్వాత ఏంటి వదిన సాక్షి సూసైడ్ చేసుకుంటా అని మహేంద్ర దేవయానితో అంటాడు. అలా మాట్లాడుతుంటే రిషికి కోపం వచ్చి ఈ టాపిక్ వదిలేయండి ఇదంతా అనవసరమైన టాపిక్ పెద్దమ్మ సాక్షితో చెప్పండి ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. దేవయాని కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. మహేంద్ర, జగతి కి డౌట్ వస్తుంది. ఇదంతా నిజమేనా సాక్షి నిజంగానే ఇలా చేసిందా అని అనుకుంటారు. తరువాత వసుధర రిషి సార్ ఏంటో ఈమధ్య మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేరు అని అనుకుంటుంది. ఈ వసుధార ఏంటో రిప్లై ఇచ్చే వరకు మెసేజ్ లతో దాడీ చేస్తుందేమో అని రిషి అనుకుంటాడు. అలా కొద్దిసేపు ఛాట్ చేసుకుంటారు.
తెల్లవారిన తర్వాత రిషి పొద్దున్నే ఫోన్లో వసుధార ఫొటో చూసుకుంటూ తనలోతాను మాట్లాడుకుంటాడు. ఏంటి వసుధార కొత్త ప్రపంచాన్ని చూపించావు, అన్నిరంగులను పరిచయం చేశావు, నన్ను నాకు తెలియజేసి, నువ్వు ఏమిటో అర్థం కాకుండా ఉన్నావు, నువ్వు అసలు నా గురించి ఆలోచిస్తావా అని అనగానే వసుధారానే రిషికి ఫోన్ చేస్తుంది. ఏంటి పొద్దున్నే ఫోన్ చేస్తుంది అని అనుకుంటున్నారా సార్ అని వసుధార రిషి తో అంటుంది, ఈ రోజు మొత్తం నేను రెస్టారెంట్ డ్యూటీలోనే ఉంటాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏంటి తను అస్సలు ఏం అనుకుంటుంది.
నేనంటే తనకు ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను అని రిషి అనుకుంటూ, రిషి సాక్షికి చేసి ఎలా వున్నావు సాక్షి నీ హెల్త్ జాగ్రత్త, నేను కాఫీ తాగడానికి రెస్టారెంట్ కి వెళుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.దాంతో తనను కూడా రమ్మన్నాడు అని అనుకొని సాక్షి కూడా వెళ్లడానికి రెడీ అవుతోంది, రెస్టారెంట్లో వసుంధరా రిషి గురించే ఆలోచిస్తూ కలలుకంటుంది అన్నీ గుర్తు తెచ్చుకుంటూ తనకి తెలియకుండానే రోజా పువ్వులతో హార్ట్ సింబల్ ని చేస్తుంది దాన్ని అలాగే ఉంచేస్తుంది తిరిగి చూస్తే రిషి అక్కడికి వస్తాడు. నువ్వు రమ్మంటే నేను రాలేదు నేను కాఫీ తాగడానికి వచ్చాను అని రిషి వసుధార తో అంటాడు.ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది