Devotional : మనం ముందుగా గుడికి వెళ్లగానే కాళ్లను నీటితో శుభ్రం చేసుకుంటాము. అలాగే కొన్ని నీళ్లను తీసుకొని మన తలపై చల్లుకుంటాము. ఆ తరువాత దేవాలయంలోకి వెళ్లి గుడి చుట్టు ప్రదక్షిణలు చేసి, ఆ తరువాత గుడి లోపలికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాము. దర్శనం అయిపోయాక కొబ్బరి కాయను కొడుతాము. అలాగే ప్రతి యొక్క పూజలోను, యజ్ఞ హోమాలలోను, వివిధ రకాల శుభకార్యాలలోను పూజ అనంతరం కొబ్బరికాయను తప్పకుండా కొడతారు. కొబ్బరికాయ లేకుండా ఏ శుభకార్యాన్ని జరిపించరు. కొబ్బరి కాయకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొబ్బరికాయను దేవాలయానికి వెళ్లగానే ఎందుకు కొడుతారు, గుడికి వెళ్లగానే ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరికాయను దేవుడి ముందు ఎప్పుడైతే కొడుతామో మనం మన అహంకారాన్ని విడుస్తున్నామని దేవుడికి తెలియజేస్తాం. అలాగే కొబ్బరికాయ లోపల ఉన్నతెల్లని కొబ్బరి వలె మన మనసు తెల్లగా ఉందని దేవుడికి తెలియజేస్తాం. అలాగే కొబ్బరిలో ఉండే నీళ్లు మన జీవితం నిర్మలంగా, తియ్యగా ఉండాలని దేవుడిని కోరుకుంటు కొబ్బరికాయను కొడుతాము. అలాగే కొంతమంది కొబ్బరికాయను కొట్టగానే లోపల పువ్వు వస్తుంది. ఇలా వస్తే చాలా సంతోషంగా ఫీలవుతారు. అయితే దేవుడికి సమర్పించిన కొబ్బరికాయలో పువ్వు రావడం శుభసూచకం అని పండితులు అంటున్నారు.
Devotional : దేవాలయంలో ఎందుకు కొబ్బరికాయను కొడతారో తెలుసా.

మనసులో దేవుడిని కోరిన కోరికకు దేవుడి నుంచి వచ్చిన రిప్లై అనుకోని దాన్ని దైవ ప్రసాదంగా భావించాలి అని చెప్తున్నారు. అలాగే మనం అనుకున్నవి జరగాలని దేవుడిని వేడుకుంటూ కొబ్బరికాయ కొడుతాం. కొబ్బరి పువ్వు వలన మనకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలాగే దేవాలయానికి వెళ్లినప్పుడు ముందుగా దేవుడి చుట్టు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. గుడిలో ప్రదక్షిణలు చేయడం వెనుక కూడా కారణాలు ఉన్నాయి. ప్రదక్షిణం అనే పదంలో ప్ర అనగా పాపాలను కడిగివేయమని, ద అనగా కోరికలు తీర్చమని, క్ష అనగా అజ్ఞానమును పారద్రోలమని, ణ అనగా ఆత్మజ్ఞానం ఇవ్వమని అర్ధం.
దేవాలయంలో దేవుడి చుట్టూ తిరిగే ఆత్మజ్ఞానంలో ఇంత అర్ధం దాగి ఉంది. పురాణాల్లో గణేశుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టు తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతాడు. కనుక మనం దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే విశ్వం చుట్టు ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. అలాగే పురాణాల ప్రకారం ఉదయాన్నే విష్ణువు ఆలయానికి వెళ్లాలి. సాయంత్రం పరమేశ్వరుడి అలయానికి వెళ్లాలి. ఎప్పుడైన సరే దేవుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అలా చేయడం వలన వారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయి.