Health benefits : ఇప్పటి కాలం ఎంతలా మారిపోయిందంటే కనీసం ఒక మనిషి ప్రశాంతంగా భోజనం చేయటానికి కూడా సమయం లేనంతగా మారిపోయింది. దీనికి తోడు మానసిక సమస్యలు, పని ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు రోజువారి జీవితంలో అలవాటైపోయాయి. ఈ సమస్యల వలన కంటినిండా నిద్ర కూడా పోలేకపోతున్నారు. ప్రశాంతంగా తినలేక పోతున్నారు. వీటివలన ఎక్కడ లేని రోగాలు వస్తున్నాయి. ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వలన శరీరానికి సరైన పోషకాలు అందక వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. మన శరీరానికి ప్రతిరోజు ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, జింక్,ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తప్పనిసరిగా మన బాడీకి అందాలి. అప్పుడే పోషకాహార లోపం పోయి గుండె సంబంధిత వ్యాధులు రావు. అయితే ఇప్పుడు ఎటువంటి పోషకాహారాలను తీసుకోవాలో చూద్దాం..
Health benefits : మీ గుండె పదికాలాలు చల్లగా ఉండాలంటే
![Health benefits : మీ గుండె పదికాలాలు చల్లగా ఉండాలంటే, ఇవి తినాల్సిందే. Health benefits vitamins and minerals for heart](https://www.yuvataram.in/wp-content/uploads/2022/06/heart.jpg)
1)మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ఒకటి ఫోలిక్ యాసిడ్.ఈ ఫోలిక్ యాసిడ్ ను బి9 లేదా ఫోలేట్ అని కూడా పిలుస్తారు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ప్రతిరోజు పిరికెడు శనగలను తినాలి. అలాగే పుదీనా, పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. పండ్లలో అయితే అవకాడో, బొప్పాయి, ఆరెంజ్, ద్రాక్ష మొదలగు వాటిల్లో ఉంటుంది.
2) అలాగే జింక్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. జింక్ మన శరీరానికి అందాలంటే మాంసాహారాలను తినాలి. మాంసకృతులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గుమ్మడి గింజలలో కూడా అధిక మోతాదులో లభిస్తుంది.
3) ఐరన్ మన శరీరానికి చాలా అవసరం. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అలాగే మన రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెరిగేలా చేస్తుంది. ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది. మనల్ని రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు బాదంపప్పు, జీడిపప్పు, ఖర్జూర మొదలగు డ్రై ఫ్రూట్స్ ను తినాలి. అలాగే చికెన్, మటన్ వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
4) ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె జబ్బులను రాకుండా చేస్తాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడ బాగా ఉపయోగపడతాయి. ఇది చేపలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే గుమ్మడి గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు అన్నింటిని తిన్నారంటే మీ గుండె పదికాలాలు చల్లగా ఉంటుంది. ఎటువంటి వ్యాధులు దరిచేరవు.