Health Benefits :అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో జామకాయ ఒకటి. ఇవి కొన్ని రోజులు మినహా సంవత్సరమంతా కాస్తూనే ఉంటాయి. పల్లెటూరులో ఇంటి ఒక జామ చెట్టు ఉంటుంది. ఇవి మనకు మార్కెట్లలో అతి తక్కువ ధరలకే లభిస్తాయి. జామకాయలు మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఈ కాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఆకు కూరలో ,కూరగాయలు లభించే పీచు పదార్థం కంటే ఎక్కువగా జామకాయలు లో ఉంటుంది జామకాయలు రసాన్ని రోజు ఒక గ్లాస్ తీసుకుంటే కాలేయం సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అదేవిధంగా శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. తరచుగా జామకాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఈ కాయను నమిలి తినడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి. పంటి సమస్యలు, చిగుళ్ల సమస్యల ను, గొంతులో గరగరను, తగ్గించడంలో జామ ఆకు ఎంతో ఉపయోగ పడతాయి. ఈ ఆకుని మెత్తగా నూరి పంటికి ,చిగుళ్ళకు లేపనంగా రాయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. జామ ఆకుల టీం తయారు చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకలి బాగా వేస్తుంది. ఈ టీ ని పరిగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. ఉదయాన లేచిన వెంటనే పరిగడుపున రోజు రెండు నుండి మూడు జామకాయలు తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. జామకాయలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది .అంతేకాకుండా వివిధ రకాల క్యాన్సర్ నుండి రక్షణ కలుగుతుంది. రోజు మూడు ద్వారకా పండిన కాయలను తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అలాగే గుండె జబ్బులు నివారణ లభిస్తుంది.
Health Benefits : అయితే వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలుసా?
శరీరంలో ఉండే అన్ని రకాల వ్యాధులకు జామకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. హై బీపీ షుగర్ సమస్యతో బాధపడే వారికి వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పురుషుల్లో సంతానం లేమి సమస్యలు దూరం చేస్తుంది. స్త్రీలలో పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండేలా చేసి అదే సమయంలో వచ్చిన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. జామకాయలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో మనం అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ లు, బ్యాక్టీరియాలు ఎక్కువై ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఈ జామకాయను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనేక రకాల వ్యాధులు బారిన పడకుండా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాయలో ఉండే విటమిన్ సి జుట్టు మెరిసేలా, దృఢంగా ,పొడవుగా నల్లగా ఉండి అన్ని రకాల జుట్టు సమస్యలను దూరం చేస్తుంది.