Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ తెలుసు కదా. జయం రవి హీరోగా తెరకెక్కిన కోమాలి అనే సినిమా తెలుసు కదా. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఈయనే. ఇటీవల లవ్ టుడే అనే సినిమా రిలీజ్ అయింది గుర్తుందా? అది కోలీవుడ్ మూవీ. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ అది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అది. ఆ సినిమా స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మొబైల్స్ ఎక్స్ ఛేంజ్ నేపథ్యంలో వచ్చిన సినిమా అది.

ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ మెయిన్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసింది. ఓవైపు ఈ సినిమా విజయంతో దూసుకెళ్తున్న సమయంలోనే ఆ సినిమా డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
Pradeep Ranganathan : అప్పట్లో రంగనాథన్ పెట్టిన పోస్టులపై నెటిజన్లు ట్రోల్స్
ప్రదీప్ రంగనాథన్.. డైరెక్టర్ కాకముందు తన సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రంగనాథన్ క్రికెట్ మీద కామెంట్లు చేశాడు. ప్రముఖ క్రికెటర్లు అయిన సచిన్, ధోనీలను తిడుతూ పోస్టులు పెట్టాడు. భారత్ కు చెందిన క్రికెటర్లలో సచిన్ అత్యంత స్వార్థపరుడని, ధోని ఏమో బాల్స్ ను విపరీతంగా వృథా చేస్తాడంటూ పోస్టులు పెట్టాడు. భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్, ధోనీలనే తిడతావా? అంటూ ఇప్పుడు రంగనాథన్ పోస్టులపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే.. కావాలని తనపై ట్రోల్స్ చేస్తున్నారని. తన ట్వీట్స్, పోస్టులను మార్ఫింగ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. అందుకే తన సోషల్ మీడియా అకౌంట్లను డియాక్టివేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కొన్ని పోస్టులను సరైన మెచ్యూరిటీ లేని సమయంలో పెట్టానని, వాటిపై ఇప్పుడు ట్రోల్స్ ఎందుకంటూ ఆయన తెలిపాడు.