Aarogyasri : ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి ఏపీలోనే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆరోగ్యశ్రీ మాత్రం కొనసాగుతూనే ఉంది. పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు తీసుకొచ్చిందే ఈ పథకం.
అయితే.. ఈ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి వైద్య సాయం కోసం ఆసుపత్రులకు వెళ్లే వారి కోసమే ప్రత్యేకంగా ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. వేరే రాష్ట్రాల వాళ్లు ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైతే.. వాళ్లకు కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Aarogyasri : ఫిబ్రవరి 14నే ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్
అయితే.. ఈ సంవత్సరం ఫిబ్రవరి 14నే ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ లో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల బారిన పడి ఏపీలోనే 8 వేల మంది దాకా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వాళ్లలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల డ్రైవర్లు, కూలీలు, ప్రయాణికులే ఉంటున్నారు. దీంతో వాళ్లకు నగదు రహిత వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడం కోసమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు రవాణా శాఖ కూడా ఆమోదం తెలపడంతో ఇక నుంచి ఏపీలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఎవరు రోడ్డు ప్రమాదానికి గురైనా సరే.. వాళ్లకు సీఎంసీవో కార్డును జారీ చేసి.. తద్వారా నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందాల్సిన బెనిఫిట్స్ అన్నీ వాళ్లకు కూడా లభిస్తాయి.