Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ చనిపోయి అప్పుడే రెండు రోజులు అయింది. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా కృష్ణ మరణాన్ని తట్టుకోలేక మూగబోయింది. ముఖ్యంగా కృష్ణ అభిమానులు అయితే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక.. కృష్ణ కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణణాతీతం. ఆయన మృతికి చాలామంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
చాలామంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని కొందరు పంపించారు. అందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు కానీ.. ఆయన చేసిన ట్వీట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. దీంతో ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Super Star Krishna : కృష్ణ చనిపోయినందుకు ఎవరూ బాధపడొద్దు అంటూ వర్మ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మరణించినందుకు అసలు ఎవ్వరూ బాధపడవద్దు. ఆయన చనిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయనిర్మల గారిని స్వర్గంలో కలుసుకొని ఉంటారు. వాళ్లిద్దరూ కలిసి స్వర్గంలో పాటలు పాడుతూ ఉంటారు. నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారని అనుకుంటున్నా అంటూ ట్వీట్ చేయడంతో పాటు వాళ్లిద్దరూ కలిసి నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోని కోరినది నెరవేరినది అనే పాట వీడియోను కూడా వర్మ షేర్ చేశారు. ఆయన సినిమా లెజెండ్. ఆయన మరణాన్ని కూడా నువ్వు పబ్లిసిటీ చేసుకుంటున్నావా వర్మ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.