Chiranjeevi :చిరంజీవి మొదటి సినిమా నుంచి ఇప్పటి సినిమాల వరకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. చిరంజీవి డ్యాన్స్ చేస్తే అభిమానులు పిచ్చెక్కిపోతారు. డాన్స్ వేస్తే చిరంజీవి లాగానే వేయాలి అని అభిమానులు మెగాస్టార్ ను ప్రశంసిస్తూ ఉంటారు. కానీ చిరంజీవి ఈ వయసులో కూడా డ్యాన్స్ ను ఇరగదీస్తున్నారు. ఇక నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆయన చేసిన ప్రతి సినిమా ఈ తరం వారు కూడా చూస్తున్నారంటే ఆయన నటించిన సినిమాలు అన్నీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలుస్తుంది.ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తొలి సినిమా చంద్రముఖి. ఏకంగా తొలి సినిమా నే సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో యోగి సినిమాల్లో నటించింది.
Chiranjeevi : ‘ గాడ్ ఫాదర్ ‘ సినిమాలో చిరుకి పోటీగా నయనతార నటన…

తన నటనకు వరుసగా సినిమాలు క్యూ కట్టాయి. ఇక కెరీర్ను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన ప్రతి సినిమా పెద్ద హీరోలతోనే చేసింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గా మ్యారేజ్ చేసుకొని తన హస్బెండ్ తో లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది . తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులను అలరిస్తుంది.
అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుందని మనందరికీ తెలుసు. డైరెక్టర్ మోహన రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో నయనతార కీలకపాత్ర నటిస్తుంది. ఇప్పటికే ఇందులో గ్రాండ్ ఫాదర్ నుంచి విడుదలైన చిరు ఫస్ట్ లుక్ ప్రేక్షకులు నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది.
తాజాగా ఈ సినిమా గురించి ముఖ్యమైన అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాలో చిరుకు, నయనతారకు మధ్య వచ్చే సీన్ లు చాలా ఎమోషనల్ గా ఉంటాయని అందులో చిరు, నయనతార పోటీపడి మరీ నటించినట్లుగా టాక్ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిం కలిపి నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.