God Father : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ చిత్రం లూసీఫర్ కు రీమేగా తెలుగులో వస్తున్నటువంటి చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాని మలయాళం లో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేయడం జరిగింది. లూసీఫర్ చిత్రానికి అనువాదంగా చిరంజీవి గాడ్ ఫాదర్ ఇప్పుడు తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో చిరంజీవి స్టైల్ కి తమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ సినిమాలో చిరు వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తూ తనదైన స్టైల్ లో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం జరిగింది.
ఈ సినిమాలో తనకు బాగా కలిసి వచ్చిన ఖైదీ పాత్రని పోషించడంతో ఇంకా ఫ్యాన్స్ లో గాడ్ ఫాదర్ పై హైప్ క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఆచార్య సినిమా మాదిరే హీరోయిన్ లేకుండా సింగిల్ గానే వన్ మ్యాన్ షో చేయనున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో చిరు ఇమేజ్ కు తగ్గట్టుగానే పూర్తిగా పొలిటికల్ డ్రామా కొన్ని మార్పు చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కన్నడ తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మలయాళంలో వచ్చినటువంటి లూసిఫర్ సినిమాకి దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ ఇదే సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషించాడు.
God Father : గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో అదిరిన మెగాస్టార్ స్టైల్.

ఇదే పాత్రను గాడ్ ఫాదర్ సినిమాలో హిందీ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్నట్లుగా అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ సౌత్ లో చేస్తున్న మొదటి చిత్రం కావడంతో ఇంకా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకి తెలుగులో డబ్బింగ్ చెప్పినటువంటి రామ్ చరణ్ తో ఉన్న స్నేహం వలన ఈ సినిమాలో సల్మాన్ డైరెక్ట్ గా చిరంజీవి త్తో ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే ఫస్ట్ ఈ పాత్రకు రామ్ చరణ్ అనుకోగా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ ను అనుకున్నారు. ఇప్పుడు చివరగా సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఒక పాట క్రియేట్ చేసి దానికి తగ్గట్టుగా మార్పులు చేసినట్టు సమాచారం. గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా నయనతార యాక్ట్ చేస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో ఒక కీ రోల్ లో సత్యదేవ్ నటిస్తున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమాకి సంబంధించి అన్ని ప్లస్ గా ఉండడంతో ఫాన్స్ లో గాడ్ ఫాదర్ సినిమాపై భారీ అంచనాలు కలిగిస్తున్నాయి. ఈ విధంగా ట్విట్టర్ ద్వారా వచ్చిన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో సోషల్ మీడియా ద్వారా దుమ్ము లేపుతుంది.