Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరక్కుతోంది. ఈనెల 22 న సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో నాగ చైతన్య.. మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

అయితే.. సినిమా విడుదల కాకముందే మూవీ యూనిట్ అప్పుడే సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా.. 5 సెకండ్స్ రూల్ అనే ఓ ఇంటర్వ్యూను మూవీ హీరో హీరోయిన్ తో చేశారు. నాగ చైతన్య, రాశీ ఖన్నా.. ఇద్దరూ ఏ ప్రశ్నకైనా 5 సెకన్లలో సమాధానం చెప్పాలన్నమాట.
Naga Chaitanya : హోస్ట్ నే తిరిగి ప్రశ్నించిన నాగ చైతన్య
ఎగ్జయిట్ అయినప్పుడు ఏం చేస్తారు.. జర్మనీలో తయారైన కార్ల కంపెనీల పేర్లు, కొన్ని డాగ్ బ్రీడ్స్, ఫార్ములాలు, కెమికల్ ఫార్ములా, భాషలు.. ఇలా అన్ని రంగాల నుంచి నాగ చైతన్య, రాశీ ఖన్నాను హోస్ట్ ప్రశ్నలు అడిగాడు. డబుల్ మీనింగ్ పదాలు ఏంటో చెప్పండి అని నాగ చైతన్యను అడగగా.. అవేంటో నాకు తెలియదు. నేను ఏదున్నా సూటిగా చెప్పేస్తా.. డబుల్ మీనింగ్ అస్సలు ఉండదు. స్ట్రయిట్ గా పాయింట్ చెప్పేస్తా.. పోనీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏముంటాయో నువ్వు చెప్పు అంటూ హోస్ట్ నే నాగ చైతన్య తిరిగి ప్రశ్నించాడు.
అయితే.. ఇదంతా ఫన్నీ ఇంటర్వ్యూ. కొన్ని ప్రశ్నలకు రాశీ ఖన్నా కూడా సమాధానాలు చెప్పలేకపోయింది. నాగ చైతన్య కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇది కూడా మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే చేసిన ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ వీడియోను తాజాగా సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.