Ananya Nagalla : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రోజుకో హాట్ టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా రాజకీయాలలో కూడా విమర్శలు ఒక పొంతన లేకుండా హద్దులు దాటుతూ ఉన్నాయి. అంతేకాకుండా పార్టీలో అభిమానుల పిచ్చికి హద్దు లేకుండా అయిపోతుంది. రాజకీయపరమైన విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఏ కాకుండా టాలీవుడ్ సూపర్ సార్ అని కూడా చెప్పొచ్చు. ఆయన వ్యక్తిగతం జీవితం రాజకీయ జీవితం వేరు వేరు. అలా వేరువేరుగా చూడని వాళ్ళు రాజకీయంలో ఉండడంతో ఆయన సినీ జీవితాన్ని రాజకీయ జీవితంతో ముడి పెడుతూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఏపీ లో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టిడిపి జనసేన పార్టీ అభిమానులు మధ్య సోషల్ మీడియాలో వార్ బాగానే జరుగుతుంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభిమానులు కొందరు పర్చితి పార్టీలు చెందిన వారిని గట్టిగానే విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కూడా రాజకీయంలో ఇన్వాల్వ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Ananya Nagalla : ఇదేం ట్విస్ట్ రా బాబు….

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని ప్రతిసారి విమర్శిస్తూ తెరపైకి తెస్తున్నారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా అనారోగ్యంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి ఈ మధ్యనే తెలియడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఆమెను చూడడానికి వెళ్లడం లేదని పవన్ కళ్యాణ్ కు ఆమెకు కూడా విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ తో నటించిన అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దానికి కౌంటర్ ఇస్తూ కొంతమంది అనన్య నాగాలాండ్ పవన్ కళ్యాణ్ ని నువ్వు పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు చేశారు. కాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
