Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ వలన కలిగే ఈ ప్రయోజనాల కోసమైనా తిని తీరాల్సిందే!!

Dragon Fruit :  డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. అందుకే డ్రాగన్ ఫ్రూట్ ను సూపర్ ఫ్రూట్ గా పరిగణిస్తారు. ఈ పండు తినడం వలన మధుమేహం, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో 102 క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ లో 22 గ్రాములు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందులో 13 గ్రాముల చక్కెర కూడా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లో కొవ్వు అస్సలు ఉండదు. అందువలన గుండె రోగులకు ఈ ప్రూట్ చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్ సీడ్ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తిని బలపరుస్తుంది.

Advertisement
Health benefits of dragon fruit
Health benefits of dragon fruit

డ్రాగన్ ఫ్రూట్ గింజలు ఒమేగా త్రీ ఒమేగా 9 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది గుండె కణాలను బలపరుస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతోంది. బరువు నియంత్రణలో ఉంచడానికి డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, బీటా సీనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వలన కణాల నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్యం, క్యాన్సర్ కు కారణం అవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్రీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గట్ లోని మంచి బ్యాక్టీరియాకు పోషణ ఇస్తుంది. అంటే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా ఉంటుంది. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే జీర్ణ వ్యవస్థ చాలా బూస్ట్ అవుతుంది.

Advertisement

ప్రీ బయోటిక్స్ చెడు బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్యాక్రియాస్ లో దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తాయి. ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటే ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. ఇన్సులిన్ బ్లడ్ లో చక్కెరను చేస్తుంది. తక్కువ ఇన్సులిన్ ఉంటే డయాబెటిస్ వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో బీటా కెరోటిన్, లైకోపీన్ ఉంటాయి. కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వలన క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Advertisement