Guppedantha Manasu 10 October 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 10-October-2022 ఎపిసోడ్ 577 ముందుగా మీ కోసం. జగతి వసుధార ని నిలుస్తూ ఉంటుంది, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లనే రిషి బాధపడుతున్నాడు, అసలు ఒప్పందమే మర్చిపో, నేనే చెబుతున్నాను అమ్మా అని పిలవకపోయినా ఫర్వాలేదు అని ఇలా జగతి చేపుతుా వుంటుంది. అయినా కూడా వసుధార వినకపోవడంతో అక్కడ ఉన్న ఫైల్స్ను విసిరి వేస్తుంది కోపంగా, అక్కడికి మహేంద్ర వస్తాడు, ఏమైంది అని అడగ్గానే, జరిగింది చెబుతూ ఉంటుంది జగతి, వసుధరా ఇలా చేస్తుంది అని కోపంగా అనడం తొ, వసుధారాణి మహేంద్ర అక్కడినించి పంపిస్తాడు, తరవాత జగతి చాలా బాధ పడుతుంది, నేను తల్లిగా ఫెయిల్ అయ్యాను, అప్పుడు చిన్నప్పుడు తల్లిగా పక్కన ఉండి చూసుకోలేదు, ఇప్పుడు నా వల్ల సంతోషంగా లేడు రిషి అని చాలా బాధపడుతూ, కళ్లు తిరిగి కిందపడిపోతుంది, తరవాత ధరణి, రిషికి ఫోన్చేసి జగతి కళ్లు తిరిగి కిందపడిపోయిన విషయాన్ని చెబుతోంది, ఇప్పుడు ఎలా ఉంది అని రిషి అడుగుతాడు, డాక్టర్ చూస్తున్నాడు రిషి అని చెపుతుంది. డాక్టర్ జగతిని చెక్ చేస్తుంది, హెల్త్ పరంగా తనకు ఎటువంటి కంప్లైంట్స్ లేవని ఏదో విషయంలో తీవ్రంగా మనస్తాపానికి గురైనట్టు న్నారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డాక్టర్ వెళ్లిపోతుంది, డాక్టర్ వెళుతూ వుండగా దేవయాని ఏమైంది అని వెటకారంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. రిషి క్యాంటీన్ కి వెళతాడు.
Guppedantha Manasu 10 October 2022 Episode : కళ్లు తిరిగి పడిపోయిన జగతి, ఆందోళనలో మహేంద్ర, వసుధార
వసుధార ఏమైంది మేడంకి అని అడుగుతాడు, మేడమ్ కి ఏమైంది సార్ అని అనగానే, నీకు విషయం తెలియదా కళ్ళు తిరిగి పడిపోయింది అంటా అని రిషి వసుధార తొ చెబుతాడు. వసుధార జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది, ఏమైంది వసుధార అని అనగానే, మేడమ్ కళ్లు తిరిగి పడిపోవడానికి కారణం నాకు తెలుసు సార్ అని అంటూ, ఇలా కొద్దిసేపు రిషితో బాధపడుతూ, మాట్లాడుతూ ఉంటుంది. నాతో పాటు వస్తావా ఇంటికి అని, నేనిక్కడికి వచ్చింది నిన్ను తీసుకొని వెళ్లడానికి, కాఫీ తాగడానికి కాదు అని చెబుతాడు రిషి. వసుధరా వస్తాను సార్ అని అంటోంది. ఒకవైపు జగతి సృహలోకి వస్తుంది, మహేంద్ర జగతి కి ధైర్యం చెబుతూ ఉంటాడు, నువ్వు బలహీనంగా ఉండకూడదు, టెన్షన్స్ పెట్టుకోవద్దు అని మాట్లాడుతూ వుంటాడు. గౌతమ్ కూడా వచ్చి జగతిని పలకరిస్తూ ఉంటాడు. దేవయాని వీళ్ల నాటకాలు రోజురోజుకీ ఎక్కువైపోతు ఉన్నాయి, ఇలానే చూస్తూ ఉంటే ఇంక ఏం చేస్తారో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటూ, రిషి వసుధార భార్య భర్తలుగా వచ్చినట్టు కల కoటు ఉంటుంది. అప్పుడు రిషి వచ్చి ఏమైంది పెద్దమ్మా అని అనగానే, ఏమీ లేదు రిషి అని అంటుంది, మేడమ్ కి ఎలా ఉంది అని రిషి అడగ్గానే, ఏదో నీరసంగా వుంది ఏమైంది ఏమీ కాలేదులే అని అంటుంది.
మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని అనడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. వసుధార జగతి గదికి వెళుతుంది, జగతి పిలుస్తోంది రా వసుధార అని, ఎలా ఉంది మేడమ్ అని అనగానే, నువ్వు ఎలా వచ్చావ్ అని అడుగుతుంది జగతి, రిషి సార్ తొ వచ్చాను మేడమ్ అని వసుధార అంటుంది, మీరిద్దరి మధ్య అంతా బానే ఉందా అని జగతి అడుగుతూ ఉంటుంది. మేడమ్ ఎలా విడిపోతాం, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెబుతూ ఉంటుంది, అయినా మీరు పేషెంట్ లాగా బెడ్ మీద పడి ఉండడం ఏమీ బాగాలేదు మేడమ్ అని, మీరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటు నన్ను తిడుతూ ఉండాలి అని వసుధార అనగానే, నేను కాలేజ్ ఉన్నా ఇంట్లో ఉన్నా పైకి మాత్రం ఉత్సాహంగా ఉంటాను, కానీ నాలో తల్లి ఎప్పుడూ ఓడిపోతుంది అని చాలా బాధ పడుతూ ఉంటుంది, జగతి బాధపడటంతో వసుధరా మేడమ్ మిమ్మల్నీ జడ్జిగా బొమ్మల కొలువుల పోటీలకి పిలిచారు అని టాపిక్ని మారుస్తుంది, దాంతో జగత్ బొమ్మలకొలువా నేనే నా జీవితంలో ఒక దోషిగా మిగిలిపోయాను, నేనెలా జడ్జిమెంట్ చెప్పగలను అంటూ బాధ పడుతూ ఉంటుంది. వీళ్లు మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ రిషి వింటూ వుంటాడు, రిషి వినడాన్ని వసుధార గమనిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.