Diabetes Health : ఆపిల్ ఆరోగ్యానికి మంచిది అని చాలామంది అంటుంటారు రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు అంటారు. ఆపిల్ లో పోషకాలు అధికంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. యాపిల్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ,ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఆపిల్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు బలంగా తయారవుతాయి. డయాబెటిస్ బాధితులు యాపిల్ తీసుకోవచ్చా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. దీనిలో ప్రాక్టీజ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు.
ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలవిసర్జన సమస్యలు దూరం అవుతాయి. దీని కారణంగా డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థానాన్ని వేగంగా పెంచకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా యాపిల్ లో ఉండే కార్బోహైడ్రేట్లు పాలి ఫినాల్స్ జీర్ణక్రియ ప్రక్రియను తగ్గింపజేయడంలో సహాయపడతాయి. ఆపిల్స్ గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ రెండింటిలోనే తక్కువ ర్యాంక లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అధికం చేయకుండా నియంత్రిస్తాయి. రోజు ఒక ఆపిల్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.
Diabetes Health : డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఆపిల్ తినవచ్చా.?
తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. ఆపిల్ తొక్కలో అలీ ఫినాల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ విడుదల చేయడానికి ప్యాంక్రియాస్ ప్రేరేపించి, చక్కెర సోషణ కు సహాయపడతాయి. తద్వారా డయాబెటిస్ పేషెంట్లు ఆపిల్ ని డైట్ లో చేర్చుకోవచ్చు. కూరగాయలు పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.