Guppedantha Manasu 10 September 2022 Episode : దేవయాని ప్రవర్తనకి అనుమానంలో జగతి, మహేంద్ర, వసుధారని ఇంటికి పిలిచిన రిషి

Guppedantha Manasu 10 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 10-September-2022 ఎపిసోడ్ 552 ముందుగా మీ కోసం, జగతి, మహేంద్ర వసుధార వాళ్ళ క్యాంటీన్ కి వెళతారు. వసుధారతో ఇలా అంటారు, చాలా సంతోషంగా ఉంది రిషిని మార్చినందుకు అనగానే, లేద్సార్ ఈ మార్పుకి కారణం నేను కాదు, దేవయాని మేడమ్ చెప్పారు ఇదంతా చేయమని అని, దేవయాని తనతో చెప్పిన విషయాన్ని వీళ్లతో చెబుతుంది. దాంతో జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు.అప్పుడు వసుధార నిజంగానే చెప్పారు మేడం అని అంటుంది. దాంతో జగతికి ఏదో అనుమానం వస్తుంది. ఏంటి అక్కయ్య చెప్పడమేంటి అని అంటుంది. పర్వాలేదులే జగతి మనమిప్పుడు ఎంజాయ్ చేద్దాం అనగానే, లేదు మహేంద్ర సాక్షి వెళ్ళిపోయినప్పటినుంచీ అక్కయ్య సైలెంటుగా ఉంది, ఏం రియాక్ట్ అవ్వడం లేదు, ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది, ఎక్కువ సంతోషపడకు అని అంటుంది జగతి. ఇంతలో వసుధార కళ్లు మూసుకుని ఉంటుంది, ఏమైంది అని వీళ్లు అడగ్గానే, ఎందుకో నాకు రిషి సార్ వస్తున్నాడు అని అనిపించింది అనగానే,జగతి పద వసుధార ఇంటికి వెళదాం అని అనగానే, లేదు మేడం డ్యూటీ ఉంది అని అంటోంది.ఇంతలోనే నిజంగానే రిషి వస్తాడు.

Advertisement

Guppedantha Manasu 10 September 2022 Episode : దేవయాని ప్రవర్తనకి అనుమానంలో జగతి.

దాంతో మహేంద్ర సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాడు, ఇదేనేమో ప్రేమ అంటే అని, పద జగతి మనం వెళదాం అని అంటూ వుండగా, ఏంటి నేను రాగానే మీరు వెళ్లిపోతున్నారు డాడ్ అని రిషి అంటాడు. లేదు వచ్చిన పని అయిపోయింది వెళుతున్నాం అని చెప్పి వెళతారు. తరువాత వసుధార సార్ ఆర్డర్ ప్లీస్ అని అనగానే, నాకు ఏమీ వద్దు, బయటికి వెళ్దాం పద, ఇదే నా ఆర్డర్ అని చెపుతాడు. వసుధారాని ఇంటికి తీసుకుని వెళతాడు.దేవయాని వసుధారా ని చూసి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని, నార్మల్ గా మాట్లాడుతుంది. పెద్దమ్మ ఏర్పాట్లు లో ధరణి వదినకి సహాయంగా ఉంటుందని వసుధారని తీసుకొచ్చాను అని అనగానే, నేనూ అదే అనుకున్నాను రిషి అని అనుగుణంగా, తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. దాంతో జగతికి, మహేంద్రకి ఇద్దరికీ అనుమానం వస్తుంది, ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు, తన ప్రవర్తనకి ఇద్దరూ ఆలోచనలో పడతారు, జగతి అనుకుంటుంది గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి అని, వసుధార ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెబుతుంది.

Advertisement
Guppedantha Manasu 10 September 2022 Episode
Guppedantha Manasu 10 September 2022 Episode

ఇలాగా సరదాగా పనులు మొదలు పెడుతూ ఉంటారు.తరువాత మహేంద్ర, జగతి ఇద్దరూ కొద్దిసేపు వసుధారని ఆటపట్టిస్తారు, వాళ్లు రమ్మన్నప్పుడు ఇంటికి రాకుండా, రిషి రమ్మనగానే వచ్చింది అని, తర్వాత అందరూ భోజనానికి బయలుదేరుతాడు, అప్పుడు రిషినే స్వయంగా వసుధారకి వడ్డిస్తూ ఉంటాడు.దానిని చూస్తూ, గౌతమ్, మహేంద్ర చిన్నగా మాట్లాడుకుంటారు, మనకు ఎప్పుడైనా ఇలా వడ్డీ౦చ్చాడా అంకుల్ అని అనగానే, నాకు కుడా ఎప్పుడు ఇలా చేయాలేదు గౌతమ్ అని, ఇద్దరూ ఇలా అనుకుంటారు. అప్పుడు వదిన వాళ్లకు వడ్డించండి అని రిషి అంటాడు, ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు అందరూ.తర్వాత అందరూ పూలు అల్లుతూ ఉంటారు, అప్పుడు ధరణి అంటోంది, వసుధార నీకు అన్నీ పనులు వచ్చు, నువ్వు బాగా అల్లుతున్నావు అని అనగానే, జగతి కూడా అంటోంది, వసుకి అన్ని పనులు వచ్చు, ఆల్రౌండర్ అని అనగానే, ఇంతలో మహేంద్ర, రిషి కూడా వస్తారు, వసుధార, రిషి ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. జగతి మేడమ్ మీమేం సహాయం చేయగలము అని మహేంద్ర అనగానే, ఈ పనిని చెయ్యలేవులే మహేంద్ర అని అనగానే, అన్నిరంగాల్లో మగవాళ్ళు ముందున్నారు, ఏమంటావ్ రిషి అనగానే, కొంపదీసి ఇప్పుడు వీటిని అల్లాలి అంటారా డ్యాడి అనగానే, అవును కొంపదీసి ఏంటి అల్లాలి అని అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement