Health Benefits : పెసల మొలకలలో అద్భుతమైన పోషకాలు… ఇవి తీసుకుంటే గొప్ప ఆరోగ్య లాభాలు…

Health Benefits : మొలకలలో అద్భుతమైన పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని నిత్యము తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఈ మొలకల్లో ఖనిజాలు, విటమిన్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో అధిక కొవ్వు ని కరిగించడంలో ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది. స్లిమ్ గా తయారవ్వాలి అనుకున్న వారికి ఈ మొలకలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఎటువంటి భయం లేకుండా వీటిని నిత్యము తీసుకోవచ్చు. ఈ మొలకలు వలన ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

బఠాని, చిక్కుడు ,పల్లీలు ,పెసలు లాంటి మొలకెత్తిన మొలకలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలగజేస్తాయి. అందుకే అందరూ మొలకలను తప్పకుండా తీసుకోవాలి. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ పెసలు మొలకలు మాత్రం మన శరీరానికి ప్రోటీన్లు అందజేయడమే కాకుండా ఇంకెన్నో ఆరోగ్య లాభాలను కూడా అందిస్తాయి. రక్తహీనతకు బెస్ట్… ఈ మొలకల్లో పుష్కలంగా లభించే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ని మెరుగు పరుస్తాయి. దానికి ఫలితంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.

Advertisement

Health Benefits : పెసల మొలకలలో అద్భుతమైన పోషకాలు…

moong sprouts are rich in nutrients and have great health benefits
moong sprouts are rich in nutrients and have great health benefits

పోషకాలకు బెస్ట్: పెసర మొలకలు లలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి లాంటి పోషకాలకు ఇది నిలయం. అధిక బరువు తగ్గడానికి బెస్ట్ ఆహారం: ఈ స్పెషల్ మొలకలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసే వారికి వీటికి మించిన ఫుడ్ లేదని తెలియజేయవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన వీటిని తీసుకోగానే కడుపు నిండిన భావన ఉంటుంది. ఇక అప్పుడు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలనిపించదు. ఆకలి దప్పులు కూడా తీరుతాయి. అలాగే దానికి ఫలితంగా అధిక బరువు కూడా తగ్గడం ఈజీ అవుతుంది.

Advertisement