Guppedantha Manasu 11 July Today Episode : మహీంద్రా, జగతి, గౌతమ్, ఒకే కారులో వెళ్తూ ఉంటారు. ఎలాగో అలాగ ప్లాన్ చేసి వసుదార, రిషిని ఒకే కారులో వెళ్ళేలాగా చేశాం అంకుల్ అని గౌతమ్, మహీంద్రాతో చెప్తాడు.మనం వాళ్లిద్దరినీ ఒకే కారులో వెళ్ళేలాగా చేశాం కానీ వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారో లేదో అని అంటాడు మహీంద్ర.రిషి చూస్తేనేమో నిప్పుమీద,ఉప్పులాగా చిటపటలాడుతున్నాడు. వసుదార ఆరోగ్యం బాగోలేక చాలా డల్గా ఉంది. ఎలాగూ ఏంటో అని మహీంద్రా గౌతమ్ తో చెప్తాడు.ఈరోజు నేను కూడా క్లాస్లో వసుధారాని కోప్పడ్డాను మహేంద్ర తన హాట్ అయ్యిందేమో అని జగతి అంటోంది.
తాను మెరిట్ స్టూడెంట్ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి క్లాస్ సరిగా వినడంలేదనే తనమీద అరిచాను, అని జగతి మహేంద్రతో చెప్తుంది. వసుదార కాన్సన్ట్రేషన్ ఏం పోలేదు తన కొంచెం అయోమయంలో ఉంది. అని చెప్తాడు మహేంద్ర.తన లక్ష్యం తనకి బాగా గుర్తుంది అని మహేంద్ర జగతి తో చెప్తాడు.రిషి వసుదార ఇద్దరూ మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు ఏవీ ఉండవు అని జగతి మహేంద్రతో చెప్తుంది. మనం కోరుకునేది కూడా అదే కథ అలాగే జరగాలని కోరుకుందాం అని మహీంద్రా, జగతి తో చెప్తాడు.

ఇకపోతే వసదారని రిషి హాస్పిటల్ కి తీసుకెళ్లే బయటకి తీసుకొస్తాడు ఈమెడిసన్ వాడు కొంచం ఓపికగా ఉంటుంది అని చెప్పి తన చేతికి మెడిసన్ ఇస్తాడు రిషి.రిషి సార్కి నామీద ఎంత శ్రద్ధో అనే వసుదార మనస్సులో అనుకుంటోంది.అవును వసుధరా అసలు నీకు నీరసం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు రిషి. శక్తిలేకపోవడంతో సార్ అని వసుధార చెప్తోంది. ఎందుకు శక్తి లేదు అని అంటాడు రిషి.సరిగ్గా వినకపోవడం వలన సార్ అని చెప్తుంది వసుధార. నీకు ఓపిక లేనపుడు కాలేజీలో క్లాస్ వినకుండా కాలేజ్ ఫీల్డింగ్పైనా నీకు ఏం పని అని కోప్పడతాడో రిషి.
Guppedantha Manasu 11 July Today Episode : వసుధార అనుకోకుండా తన మనసులో మాటని రిషితో చెప్తుందా.
ఉపన్యాసాలు బాగా చెప్పావు కదా మరి నువ్వెందుకు పాటించవు అని వసుదారని, రిషి అడుగుతాడు.ఒక చోట కొబ్బరి బోండం తాగటంకోసం రిషి కార్ ఆపుతాడు.రిషినే రోడ్డు దాటి వెళ్లి కొబ్బరిబోండాలు తీసుకొచ్చి వసుదార చేతికి ఇస్తాడు. అలా ఇద్దరూ కొబ్బరిబోండాలు తాగుతారు.అవును ఆ రోజు రెస్టారెంట్ దగ్గర టైర్లో గాలి తీసింది నువ్వే కదా అని రిషి వసుదారని అడుగుతాడు. నువ్వే టైర్లో గాలి తీశావని నాకు తెలుసు అని రిషి వసుధారతో చెప్తాడు.అయినా మీరు ఆ సాక్షి తో సినిమాకి ఎలా వెళ్తారు సార్ అది నాకు నచ్చలేదు. అందుకే అలా చేశాను అని వసుధార చెప్తుంది.
ఎందుకు నచ్చలేదు అని రిషి వసుధరని అడుగుతాడు.నచ్చకపోవడానికి కారణం ఉంటుంది కదా అని రిషి అంటాడు. నచ్చకపోడానికీ చాలా కారణాలు ఉన్నాయి సార్. కావాలంటే వంద చెప్తాను అని వసుదార అంటోంది.ఇన్నాళ్ల పరిచయంలో నన్నెప్పుడైనా సినిమాకి తీసుకెళ్లారా ఎప్పుడైనా సినిమాకి రమ్మని అడిగారా అని వసుదార అంటోంది.నిన్నగాక మొన్న వచ్చిన సాక్షి తో సినిమాకి ఎలా వెళ్తారు. ఇంత పరిచయమున్న నన్ను మాత్రం తీసుకెళ్లారు అలా, ఎలా వెళ్తారు సార్ అని వసుదార, రిషీని గట్టిగా అడుగుతుంది.దాంతో ఆశ్చర్యానికి గురి అయిన రిషి వర్షం పడే లాగా ఉంది వెళ్దాం పద ముందు అనే టాపిక్ డైవర్ట్ చేశాడు. కారులోకి ఎక్కబోతుంటే సాక్షి ఫోన్ చేస్తుంది.
రిషి ,సాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి కావాలనే వసుధార ముందు సాక్షి తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో వసుదారకి చాలా కోపం వస్తుంది.అది విన్న వసుధరా కావాలనే సాక్షికి వినపడేలా గా రిషితో మాట్లాడుతుంది.నేను సాక్షితో మాట్లాడుతూ ఉంటే వసుధరకి కోపం వచ్చినట్టుంది. అని రిషి అనుకుంటాడు. ఒకప్పుడు నువ్వు శిరీష్ తో మాట్లాడితే నాకు కూడా ఇలాగే కోపం వచ్చేది వసుదార అని రిషి మనసులో అనుకుంటాడు.తర్వాత తనని రూం దగ్గర డ్రాప్ చేసి థ్యాంక్స్ అలాంటివి ఏమీ వద్దు కానీ సరిగా తిను అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.
జరిగిన విషయం మొత్తం సాక్షీ, దేవియానితో ఫోన్లో చెప్తూ వుంటుంది. నేను ఫోన్ చేసినప్పుడు రషి పక్కనే ఉంది,ఆ వసుధార రిషితో కార్లలో తిరుగుతూ ఉంది అని చెప్తోంది సాక్షి .కానీ అదేంటో తెలియదు కాని అంటీ రిషి ఇంతకుముందు లాగా కాకుండా నాతో బాగానే మాట్లాడుతున్నాడు అని సాక్షి దేవయానితో చెప్తుంది.అలా వాళ్ళిద్దరూ కొద్ది సేపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు.ఇకపోతే మహేంద్ర, జగతి రిషి , వసుదార గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితుల్లా గా ఉన్నారా ఎలా ఉన్నారో అని. వాళ్లిద్దరి గురించే కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.
మన ప్రమేయం ఉన్నా లేకున్నా వాళ్లిద్దరూ ఒక్కటైతే చాలు అని మహీంద్రా జగపతితో చెప్తాడు.మహీంద్ర, జగతి మాట్లాడుకుంది మొత్తం దేవయాని వింటోంది. మొగుడూ పెళ్ళాలు కలిసి వసుదార, రిషిని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అని కోపంగా వెళ్తోంది దేవయాని.ఏదో సౌండ్ వచ్చింది అని జగతి బయటికి వచ్చి చూస్తుంది కానీ అక్కడ ఎవరూ కనిపించరు.నైట్ అయిన తరవాత రిషి రూమ్లో ఒక్కడే ఉండి వసుంధర గురించే ఆలోచిస్తూ ఉంటాడు . ఇంతలో గౌతమ్ వెళ్తుంటే రిషి పిలుస్తాడు.గౌతమ్ ఫోన్తోనే వసుధరకి ఫోన్ కలిపి తన హెల్త్ ఎలా ఉందో కనుక్కో అని రిషి గౌతమ్తో చెప్తాడు.
గౌతమ్ ఫోనెత్తగానే హలో వసుధార, హెల్త్ ఎలా ఉంది ఏం చేస్తున్నావ్ తిన్నావా అని రిషి అడగమన్నాడు అని చెప్పేస్తాడు.అది విన్న రిషి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు తను నీరసంగా అయితే కనిపించట్లేదు ఇంక చాలు అని ఫోన్ పెట్టేసేయ్ అని చెప్తాడు రిషి .రిషి మీ ఇద్దరి మధ్యలో నేను మాట్లాడటం కరెక్టు కాదు కానీ మీ ఇద్దరి మధ్యన ఈ దూరం ఏంటి అని గౌతమ్, రిషి ని అడుగుతాడు. ఏంటి ఏం మాట్లాడవు అని గౌతమ్ రిషీని అంటాడు. నేను మనసులో మాట్లాడుకుంటూనే ఉన్నాను అని రిషి సమాధానం ఇస్తాడు.
నీ భవిష్యత్తు గురించి అసలు ఏం చేయాలనుకుంటున్నావు, ఏమాలోచిస్తున్నావ్ అని గౌతమ్ రిషిని అడుగుతాడు. నా భవిష్యత్తు మొత్తం నాకు చీకటిగా కనిపిస్తుంది అని రిషి అంటాడు.రిషి సార్ నా భవిష్యత్తు ఏంటో తెలుసా మీరేనా భవిష్యత్తు అని వసుదార తనకుతాను మాట్లాడుకుంటూ ఉంటుంది.సాక్షికి భయపడో,ఇంకేదో కారణం చేతనో మీకు నో చెప్పలేదు. అప్పుడు నా మనసు చెప్పింది నేను చేశాను.కానీ కాలితెనెెే కథ బంగారానికి విలువ తెలిసేది, దూరమైతేనే కదా విలువ తెలిసేది నాకిప్పుడు మీ విలువ తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది వసుదార.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.