Health tips : అన్ని కూరగాయల్లో కెల్లా బీరకాయ అత్యంత పోషకాలు కలిగి ఉంది. ఈ కాయ మార్కెట్లలో అందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని సీజన్లో లభిస్తుంది. బీరకాయ తో చేసిన కూర కాని పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీ కి కావలసిన విటమిన్స్ ,మినరల్స్ వివిధ రకాల పోషకాలు బీరకాయలో ఉంటాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. బీరకాయలు కొవ్వు ,కొలెస్ట్రాల్ క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
అలాగే దీన్ని ఉదయం పరిగడుపున జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. బీరకాయలు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది. అలాగే మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ సి ,జింక్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడానికి ఇందులో ఉండే బీటా కెరోటిన్ బాగా ఉపయోగపడుతుంది. బీరకాయలో శరీరానికి కావాల్సిన ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
Health tips : బీరకాయ రోజు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్

డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కి సహాయంగా పనిచేయడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంచవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కామెర్లు వంటి వ్యాధులకు బీరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. లివర్ ను శుభ్రపరిచి ,రక్తహీనత సమస్యలను నివారిస్తుంది. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవ్వటంలో కీలక పాత్ర వహిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. చర్మ, జుట్టు సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సమస్యలను అరికడుతుంది.