Guppedantha Manasu 11 October 2022 Episode : చిన్నితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 578 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జగతి దగ్గర కూర్చుని మహేంద్ర వసుధర తనకి ధైర్యం చెబుతూ ఉంటారు. చాటుగా చూస్తున్న రిషి ని వసుధార చూసి తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే రిషి మేడంకి ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మహేంద్ర రిషి దగ్గరికి వెళ్లి అలా చాటుగా ఎందుకు చూస్తున్నావ్ రిషి అనగానే… తనని జాగ్రత్తగా చూసుకోండి మంచి ట్రీట్మెంట్ చేయించండి అనగానే మహేంద్ర తనకి ట్రీట్మెంట్ కాదు రిషి కావాల్సింది తనకి ప్రేమ కొడుకు ప్రేమ కావాలి తల్లిగా ఓడిపోతుంది తనని గెలిపిస్తావా.. అని అడగగానే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వసు కిచెన్ రూమ్ లోకి రాగానే దేవయాని తనను చూసి ధరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత దేవయాని వసుని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎలా రావాలనిపించింది అని అంటూ ఉండగా…
Guppedantha Manasu 11 October 2022 Episode : జగతి తో ప్రేమగా మాట్లాడుతున్న రిషి…
వసుధార దేవియానికి మాటికి మాట సమాధానం చెప్తూ ఉంటుంది. దేవయాని షాక్ గురవుతూ ఉంటుంది. అంతలో రిషి రావడానికి చూసి నీ పని తర్వాత చెప్తా అని దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.వసుధార రిషి దగ్గరికి వెళ్లి కాఫీ పెట్టి మంటారా సార్ అని అడగగానే నాకు ఏమీ వద్దు అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మహేంద్ర జగతి దగ్గర కూర్చుని ధైర్యం చెబుతూ ఉండగా.. మనుషులు అన్న తర్వాత ఆశ ఉంటుంది కదా మహేంద్ర నా కొడుకు నా దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడాలి అని ఊహించుకోవడంలో తప్పేముంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ వసుధారని దింపి రావడానికి వెళుతూ ఉండగా.. రిషి గురించి గౌతమ్ ,వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి ఒక్కడే ఒక దగ్గర కార్లో కూర్చొని వసుధర గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే వసుధార దగ్గర ఉన్న బొమ్మలుకి వాళ్ల ఇద్దరు పేర్లు పెట్టుకుని సరదాగా వాడితో మాట్లాడుకుంటూ ఉంటుంది. తర్వాత రిషి వసుధార మెసేజ్లు పెట్టుకుంటూ సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు.

కట్ చేస్తే రిషి జగతికి కాఫీ చేసి తీసుకొని వస్తాడు. జగతి ఆశ్చర్యంతో నువ్వెందుకు తీసుకొచ్చావు రిషి అని అనగానే.. ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు ఆడ మగ తేడా లేకుండా రూల్స్ ఏం లేవు అని అంటూ ఉంటాడు. మీరు బాధపడుతున్న బాధకి నేను కారణం కాదు మీరే కారణం అంటూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది డాడ్ ని మీరు బాధ పెట్టకండి డాడీ సంతోషాన్ని దూరం చేయకండి నేను మాట్లాడే మాటలు కొంచెం కఠినంగానే అనిపించవచ్చు కానీ నేను మాట్లాడేది ప్రతిదీ అబద్ధం కాదు మీ పిలుపు కోసం మా ఇద్దరి బంధాన్ని దూరం చేయకండి వసుధార వచ్చిన తర్వాతే నాకు జీవితం అంటే ఏంటో అర్థం అయింది అంటూ మీ పిలుపు కి విలువ ఎంతో తెలుసా నేను పోగొట్టుకున్న బాల్యమంతా అంటూ ఉంటాడు. మీ మనసు బాధపడితే క్షమించండి ఎందుకంటే తల్లి ఆదరణ లేకుండా నేను పెరిగాను నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…