Guppedantha Manasu 11 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 11-September-2022 ఎపిసోడ్ 553 ముందుగా మీ కోసం. రిషి వసుధారని ఇంటికి పిలుస్తాడు, ధరణీ వదినకి సాయంగా ఉంటుందని ఇంటికి పిలిచాను పెద్దమ్మ అని అంటూ, దేవయానితో ఇలా చెపుతూ, తీసుకొనివస్తాడు ఇంటికి.తానే స్వయంగా వసుధారకి వడ్డిస్తూ ఉంటాడు, అదంతా చూసి దేవయాని రగిలిపోతూ ఉంటుంది.భోజనం అయిన తర్వాత,ధరణి,జగతి,వసుధార పూలు కడుతుా ఉంటారు,అప్పుడు ధరణి, జగతి ఇద్దరూ వసుధారని మెచ్చుకుంటూ ఉంటారు, తనకి అన్ని పనులు వచ్చు అని,అప్పుడు అక్కడికి రిషి, మహేంద్ర కూడా వస్తారు.మేమేమన్నా సహాయం చేయమ అని మహేంద్ర, జగతిని అనగానే, ఇది ఆడవాళ్లు చేసే పని నీవల్ల కాదు లే మహేంద్ర అని, ఇలా కొద్దిసేపు ఒకరినొకరు ఆటపట్టిస్తూ ఉంటారు, ఇంతలో తెల్లారుతుంది. సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి.జగతి, మహేంద్ర ఇద్దరు రెడీ అయి, కిందకి వస్తారు. వాళ్లని చూసి, అందరూ సంతోషపడతారు. రిషి మాత్రం వసుధార కోసం వెతుకుతాడు, ఏంటి ఎక్కడ ఉంది అని అనుకుంటుా ఉండగా, వసు చీర కట్టుకొని కిందికి నడుస్తూ వస్తోంది.వసు ఎంత బాగుందో అని మనసులో రిషి అనుకుంటాడు. అప్పుడు మహేంద్ర,గౌతమ్ ఇద్దరు వసుధార కి ఎవరిచ్చారు చీర అని,సరదాగా రిషిని ఆటపట్టిస్తూ ఉంటారు, ఇలా సెలబ్రేషన్స్ మొదలై, సంతోషంగా ఉన్న సమయంలో సాక్షి అక్కడికి వస్తుంది, రిషికి కోపం వస్తుంది, కానీ దేవయాని సాక్షిని పిలవడంతో సైలెంట్గా ఉంటాడు.సాక్షి వచ్చి, ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెబుతుంది.
Guppedantha Manasu 11 September 2022 Episode : వాళ్ళ ఆనందాన్ని చూసి రగిలిపోతున్న దేవయాని
తరువాత వసుధార కిచెన్ లో ఉండగా, మహేంద్ర వసుధార దగ్గరికి వెళ్లి, థాంక్స్ అమ్మ, నేను గురుదక్షిణగా రిషిని జగతిని దగ్గర చేయమంటే, నువ్వు దానికి మించి చేశావు అని,థాంక్స్ చెపుతుండగా,అప్పుడు సార్ మీరందరూ సంతోషంగా వుంటే, నాకు సంతోషమే అని వసుధార అంటుంది. వీరిద్దరి మాటలని దేవయాని సాక్షి వింటారు.అప్పుడు వీళ్లు అనుకుంటారు మనకొక అవకాశం దొరికింది అని, తమ ప్లాన్ ని స్టార్ట్ చేస్తారు, రిషి పక్కనించి వెళుతుండగా, వాళ్ల రూమ్లో, సాక్షి దేవయానితో ఇలా అంటుంది, నేను రిషిని ఎంతో ప్రేమించాను, కానీ వీళ్ళు ఇంత మోసం చేస్తుంటే, నేను తట్టుకోలేకపోతున్నాను అని అనగానే, దేవయాని రిషి వినేలాగా సాక్షి అంతా సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావ్ అని చెప్పి,పద వెళదాము అని వెళుతుండగా, రిషి వచ్చి ఏమైంది పెద్దమ్మ అంటాడు, ఏమీ లేదు రిషి అనగానే, ఏమైందో చెప్పు సాక్షి ఎందుకు అలా అన్నావు నువ్వు అని అడగ్గానే, అప్పుడు సాక్షి అంటోంది,రిషి, వసుధార నిన్ను ప్రేమించలేదు,మహేంద్ర అంకుల్ చెప్పటం వలన గురు దక్షిణ కోసం నిన్ను, జగతి ఆంటీని దగ్గర చేయడం కోసమే, వసుధార నీకు దగ్గరైనట్టు నటించింది అని చెబుతుంది.దాంతో రిషి గుoడె ముక్కలవుతుంది,అప్పుడు సాక్షీ దేవయాని సంతోషపడతారు.

ఇక ఈ సెలబ్రేషన్స్ ఆగినట్టే అని అనుకుంటూ, తరువాత రిషి కిందికి వెళ్లగానే, మహీంద్ర కింద సంతోషంగా ఉండటం చూసి, ఏదైతే అదయింది తరువాత తెలుసుకొవాలి నిజం ఏంటో, డాడ్ సంతోషాన్ని పోగొట్ట లేను అని, దగ్గరుండి సెలబ్రేషన్స్ చేస్తాడు. రిషి మొహం డల్లుగా ఉండడాన్ని వసుధార గమనిస్తుంది, ఏమైంది సార్ అని అనగానే, తర్వాత మాట్లాడతాను వసుధార అని అంటాడు. ఫంక్షన్ అయిపోయాక వసుధారని రూమ్ దగ్గర దించుతాడు రిషి,ఏమైంది సార్, ఏదో జరిగింది మీరిలా ఉన్నారు అని అడగ్గానే,వసుధార నా దగ్గర ఏదైనా నిజం దాచావా అని అడగ్గానే, నాకు తెలిసి ఏ నిజం దాచలేదు అనగానే, రిషి అంటాడు గురుదక్షిణ గురించి అని, అప్పుడు వసుధార షాక్ అవుతుంది,రిషి సార్కి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అని,నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా వసుధార అని అనగానే, వసుధార అంటోంది సార్ నేను గురుదక్షిణ గురించి మీ దగ్గర చెప్పే అవకాశం రాలేదు, నిజమే కానీ, నేను మిమ్మల్ని తెలియకుండానే ప్రేమించాను సార్, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, మీ ఇద్దర్నీ దగ్గర చేయాలని నేను ఏటువoటి ప్రయత్నం చెయ్యలేదు, మీకు అనిపించింది చేసారు కదా సార్, ఒకవేళ మీరు జగతి మేడమ్ కి దగ్గర అయినా కాకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరంటే నాకు ప్రాణం అని చెప్పి, ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్, మీకే నిజం తెలుస్తుంది అని అంటుంది.అయితే సాక్షి, దేవయాని పన్నిన కుట్రతో రిషి,వసుధార జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది, వీళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా లేదా అనేది, రానున్న ఎపిసోడ్లో తెలుస్తోంది.