Karthika Deepam 11 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1455 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ శౌర్యను చూసి తట్టుకోలేక.. ఆ బొమ్మలన్నీ శివుని కొనుక్కు రమ్మని చెప్తాడు. అప్పుడు శివా వెళ్లి మొత్తం కొనుక్కొని వస్తాడు. తర్వాత ఆ పాపని చూస్తుంటే నాకెందుకు చాలా బాధగా ఉంది మోనిత అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత సరేగాని వెళ్దాం పద అని అంటుంది. అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సౌర్య ఆ డబ్బులు చూస్తూ సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక వాళ్లు కూడా ఇంటికి వెళ్లి పోతారు. కట్ చేస్తే మౌనిత ఇంటికెళ్లి సౌర్య గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. కార్తీక్ గతం మాత్రం మర్చిపోయేలా చేయగలుగుతున్నాను.. కానీ తన మనుషులని చూసినప్పుడు తనకి మనసులు ఏదో అలజడి కలుగుతుంది అంటే తనకి వాళ్లు కచ్చితంగా గుర్తొస్తారా అంటూ భయపడిపోతూ ఉంటుంది.
Karthika Deepam 11 September Today Episode : దీప చెప్పినట్టుగా పూజ చేస్తున్న కార్తీక్… షాక్ అవుతున్న మోనిత…
అంతలో కార్తీక్ వచ్చి ఏంటి మౌనిత ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆ ఏం లేదు పూజ ఎలా చేయాలో ఆలోచిస్తున్నాను కార్తీక్ అని అంటుంది. ఎలా ఏముంది అని శివా, నేనున్నాను కదా అంతా చూసుకుంటాం అని అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక పంతులుగారు వస్తారు. ఇక దీప కూడా వస్తుంది. ఇక దీప ను చూసి కార్తీక్ వచ్చావా వంటలక్క రండి అని పిలుస్తాడు. అప్పుడు పంతులుగారు దంపతులు పీటల మీద కూర్చోండి పూజ జరిపిస్తాను అని అంటాడు. అప్పుడు మౌనిత కార్తీక్ కూర్చోబోతు ఉండగా… దీప ఆగండి డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు అది చేయాలి కదా అని అంటాడు. అవును నువ్వు ఏదో చెప్పావు నాకు గుర్తులేదు అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప మీకు గుర్తుండదని నేను ఒక చిట్టి లో రాసి ఇచ్చాను కదా… అని అనగానే కార్తీక్ అవును అని ఇంట్లోకి వెళ్లి ఆ చిట్టిని తీసుకొచ్చి చదువుతూ ఉంటాడు. నువ్వు ఏం రాసిచ్చావే అని మౌనిత అంటుంది.

అప్పుడు కార్తీక్ తను అక్కడ పూజ జరుపుకోవట్లేదు కదా మన ఇంట్లోనే జరుపుకుంటుంది కదా.. వాళ్ల పేర్లు కూడా చదవమని అందులో అందరి పేర్లు రాసి ఇచ్చింది అని ఆ పేర్లను చదువుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. ఇక దీప తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. అలా పూజ అంతా కంప్లీట్ అవుతుంది. తర్వాత మౌనితని చూసావు కదా… నా భర్త నా మాటే వింటున్నాడు నాకు దగ్గరవుతున్నాడు ఇక ఆట మొదలైంది. అని అంటూ ఉంటుంది. ఇక తనకు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే శౌర్య మా అమ్మానాన్నలు ఎప్పుడు కనిపిస్తారు అనుకుంటూ బాధపడుతూ ఉండగా… గండ, చంద్ర వచ్చి నువ్వెందుకు అమ్మ ఊరికే అమ్మ నాన్నలను గురించి ఆలోచిస్తావు వాళ్లు బ్రతికే ఉంటే నీకు మళ్ళీ కనపడతారు. కచ్చితంగా అని ధైర్యం చెబుతూ ఉంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…