Guppedantha Manasu 12 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 12-September-2022 ఎపిసోడ్ 553 ముందుగా మీ కోసం. ఇంట్లో వాళ్లు అందరూ పూలు కడుతుా ఉంటారు. అప్పుడు అక్కడికి రిషి, మహేంద్ర వస్తారు. మహేంద్ర, జగతి తో నేను ఏమి సహాయం చెయ్యగలను అని అనగానే, జగతి ఇది ఆడవాళ్లు చేసే పని మహేంద్ర, నీ వల్ల కాదు అని అనగానే, అంటే ఇది మగవాళ్లు చేయలేరనుకుంటున్నావా, ఈరోజుల్లో అన్నిరంగాల్లో మొగవాళ్ళు ముందున్నారు, మేమెందుకు చేయలేమంటూ, ఏమంటావు రిషి అని, రిషి వైపు చూస్తూ అంటాడు, అప్పుడు రిషి డాడ్ కొంపదీసి పుాలు కట్టాలి అని అంటారా ఇప్పుడు మీరు, అని అనగానే, కొంపదీసి ఏంటి రిషి కట్టాలి అని, గౌతమ్ ఇలా రా, మనం ఇప్పుడు గెలవాలి అని గౌతమ్ కూడా పిలుస్తాడు, ఇలా సరదాగా కడుతూ ఉంటారు.అప్పుడు రిషి, వసుధార ఒకరినొకరు చూసుకుంటూ, ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్లందరూ, ఒకరి తర్వాత ఒకరు మాకు పనుందని చెప్పి, అందరూ వెళ్లిపోతూ ఉంటారు సాకులు చెబుతూ,ఏంటి అందరూ వెళుతున్నారు, పని మా మీద వదిలేసి అందరూ వెళుతున్నారు అని అనగానే, వెంటనే వస్తామని చెప్పి అందరూ వెళతారు, రిషికి పూలమాల కట్టడం రాదు, వసుధార నేను వెళ్తాను.
Guppedantha Manasu 12 September 2022 Episode : రిషికి పూలమాల ఎలా కట్టాలో నేర్పించిన వసుధార
నాకు ఈ పని రాదు అని అనగానే, ఉండండి సార్ ఇది నేను నేర్పిస్తాను అని చెప్పి, తన చేయి పట్టుకొని రిషికి వసుధార మాల ఎలా కట్టాలో నేర్పిస్తుంటుంది, ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, ఇదంతా వీళ్ళు పక్కనే ఉండి చూస్తూ ఉంటారు, మహేంద్ర అనుకుంటాడు నా కొడుకు భలే రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటాడు. పూల దండ కట్టడం అయిపోయాక, రిషి చేయి తగిలి, వసు మెడలో పడిపోతుంటుంది. ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, అప్పుడు మహేంద్ర అక్కడికి రాగానే, వెంటనే పూలమాల తీసేస్తారు, ఏంటి పనైపోయిందా అనగానే, నేను కట్టాను డాడ్ అని అనగానే, నువ్వు కట్టావా, లేకపోతే ఎవరైనా కట్టించారా అని వెటకారంగా అంటాడు మహేంద్ర , నేను వెళ్లి పడుకుంటున్నాడు డాడ్ అని చెప్పి వెళతాడు, ఇలా సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాడు మహేంద్ర. ఇదంతా దేవయాని పైనుంచి చూస్తూ, రగిలిపోతూ ఉంటుంది. తర్వాత రోజు పెళ్లి రోజు వేడుకలు మొదలవుతాయి, డెకరేషన్ అంతా వసుధార చేస్తూ ఉంటుంది.

వసు ని చూస్తూ రిషి చాలా సంతోషపడతాడు, నువ్వు నా జీవితంలోకి రావడం, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ, ధరణిని పిలిచి వదినా నాకొక చెయ్యాలి అని అడుగుతాడు, ఏంటి రిషి అని అనగానే, వదిన ఈ చీర ఎలాగైనా మీరే వసుధార కి ఇవ్వoడి అని అనగానే, నేనేంటి రిషి, నువ్వే ఇవ్వొచ్చుగా అనగానే, తనకి చీర కట్టుకోడం రాదు, మళ్లీ మిమ్మల్ని అడగడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే మీరే తీసుకెళ్లి ఇవ్వండి, తనని రెడీ చేయమని ధరణికి చెప్పడంతో, వసుధార చాలా లక్కీ అని అనుకుంటుా, సరే రిషి అని చెబుతుంది. వసుధారని పిలిచి చేసిన అరెంజ్మెంట్స్ చాలు, నువ్వు రెడీ అవ్వు, మేమందరం రెడీ అయ్యాము అని పిలవగానే, నేను రెడీగా ఉన్నాను మేడం అనగానే, లేదు చీర కట్టుకొ,నీ కోసం రిషి ఇచ్చాడు, కడతాను అని అనగానే, రిషి పక్కనే ఉండి సైగ చేస్తాడు, కట్టుకో అని, సరే అన్నట్టుగా తల ఊపుతుంది వసు. వసుధారాని రెడీ చేసి తీసుకొని వస్తుంది, రిషి తెచ్చిన చీర, రిషి డ్రెస్కి మ్యాచింగ్ లా ఉంటుంది. ఇద్దరూ అలా పక్కపక్కనే ఉండడాన్ని చూసి, జగతి, మహేంద్ర వీళ్ళ వీళ్ళ జంట ఎంత ముచ్చటగా వుందో అని, చాల సంతోష పడతారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రానున్న ఎపిసోడ్లు దేవయాని ఏదైనా కుట్ర చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది.