Karthika Deepam 12 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1455 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ మౌనిత ఇంటికి తిరిగి వచ్చి తర్వాత కార్తీక్ శౌర్య గురించి ఆలోచిస్తూ నేను తనని ఎక్కడో చూశాను.. నాకు బాగా గుర్తుకొస్తుంది. నీకు గుర్తుందా మౌనిత అని అడుగుతాడు. అప్పుడు మౌనిత పదే పదే ఎందుకు తెలియని వాళ్ళ గురించి అడుగుతావు అని కోప్పడుతుంది. అప్పుడు కార్తీక్ అవును నీ నుంచి సమాధానం వస్తది అని అనుకోవడం నాదే పొరపాటు అని అంటాడు. సరేలే గాని వంటలు అక్కని పూజకు పిలిచావా అని అడుగుతాడు. అప్పుడు పిలిచాను కార్తీక్ కానీ రాను నేను ఇంట్లోనే చేసుకుంటాను అని చెప్పింది. అని అనగా కార్తీక్ రానందా సరేలే ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకోవాలి కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత రిలాక్స్ అయ్యి హమ్మయ్య ఇక ఏ గొడవ ఉండదు నేను కార్తిక్ మంచిగా పూజ చేసుకోవచ్చు అని సంతోష పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే దీప ఇంట్లో పూజ చేసుకుంటూ నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేవుడా నా భర్త నన్ను గుర్తుపట్టలేక పోతున్నందుకు నాకు చాలా కష్టంగా ఉంది.
Karthika Deepam 12 September Today Episode : ఏం చేయలేని పరిస్థితిలో మౌనిత…
ఆ కష్టం నుంచి దాటించి నా భర్త నన్ను గుర్తుపట్టేలా చెయ్.. లేదా ఆ మౌనిత మీద నమ్మకం పోయి నా దగ్గరికి వచ్చేలా చెయ్ అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత కార్యక్రమాలు చేస్తూ.. కార్తీక్ గతం గుర్తు రాకుండా చెయ్ దేవుడా అని అంటూ ఉంటుంది. అంతలో కార్తీక్ పంచ కట్టుకోవడం రాక మౌనితని పిలుస్తాడు. కానీ మౌనిత కి కూడా కట్టడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతలో అక్కడికి దీప వచ్చి అదంతా చూసి బయటికి వచ్చి బాధపడుతూ శివాని వెళ్లి కట్టమని చెప్పింది. అప్పుడు శివ వెళ్లి మేడం మీకు పంచ కట్టడం చేతకావడం లేదు అంట కదా.. అప్పుడు ఎవరు చెప్పారు రా నీకు అని అనగా ఆ వంట లెక్క చెప్పింది అనగానే కార్తీక్ వంటలక్క వచ్చిందా అని వస్తు ఉంటాడు.. కానీ మౌనిత కార్తీక్ ని ఆపుతుంది. ఇక కట్టుకోవడం అయిపోగానే మౌనిత కార్తీక్ దగ్గర్నుండి నువ్వు నాతో మంచిగా ఉండాలి అని మాట తీసుకుంటుంది. కానీ బయట దీప ఏడుస్తూ ఉండగా కార్తీక్ వచ్చి ఏమైంది వంటలక్క అని అడుగుతాడు. అప్పుడు దీప ఏమి మాట్లాడదు. అప్పుడు అంతలో మౌనితా వచ్చి వంటలక్క ఎప్పుడు వచ్చావు అని అంటుండగా.. అయ్యగారు ఎవరు అమ్మ ఆవిడని బంధువు అని అడగగా మౌనిత వంటలు చేసుకుంటూ బతుకుతుంది. వంటలు బాగా చేస్తుంది.

మీ గుళ్లో కావాలంటే అడగండి అని అంటుంది. అప్పుడు సరే అని పంతులుగారు అంటాడు. సరేగాని పూజ సంగతి చూద్దాం పాండి అని లోపలికి వెళ్తారు. అప్పుడు పంతులుగారు దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చుండి అంటుండగా… అప్పుడు దీప డాక్టర్ బాబు ఒక్క నిమిషం నేను ఒక విషయం చెప్పాను కదా.. అది మర్చిపోయారా అని అనగానే అవునా ఏ విషయం చెప్పారు అని అంటుండగా… అప్పుడు దీప మీరు ఇలా మర్చిపోతారని ఒక చిట్టి మీద రాసి మీ జేబులో పెట్టాను అంటూ అనగానే తను వెళ్లి ఆ పేపర్ ని తెచ్చి చదువుతూ ఉంటాడు.. దానిలో పూజలో నేను ఒక్కడినే కూర్చొని పూజ చేయాలి అని అనగానే మౌనిత ఒక్కసారి కార్తీక్ పై మండిపడిపోతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నేను నీకు చెప్పాను కదా మౌనిత నువ్వు ఎలా ప్రవర్తిస్తే నేను అదే విధంగా ప్రవహిస్తానని చెప్పాను మరి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావ్ మతిమరుపు నీకా నాకా అని అంటాడు. అప్పుడు ఇక మిగతాది కూడా చదవండి డాక్టర్ బాబు అని దీప అంటుంది. అప్పుడు కార్తీక్ మా భార్య సంతోషంగా ఉండాలి. నా భార్య అనుకున్నది జరగాలి. నా భార్యని నన్ను విడదీయాలనుకున్నోళ్లు నాశనం అయిపోవాలి.
అని చెప్తూ ఉంటాడు.అప్పుడు మౌనితాకి ఏం చేయాలో అర్థం కాక లోపల మండి పడిపోతూ ఉంటుంది. అప్పుడు పంతులుగారు ఏమి కారు అని చెప్పారు ఆవిడ మీ ఇద్దరి సంతోషంగా ఉండటం కోసం ఎంతలా ఆలోచిస్తుందో అని అంటాడు. అప్పుడు కార్తీక్ ని దీప డాక్టర్ బాబు మీరు ఇంతకుముందు ఇలాంటి పూజ చేసుకున్నారా ఎప్పుడైనా అని గతం గుర్తొచ్చేలా చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆ గతాన్ని గుర్తు చేసుకోండి అనగానే కార్తీక్ బాగా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొద్దికొద్దిగా కార్తీక్ గతం గుర్తుకొస్తూ ఉండగా మౌనిత భయపడి పోయి ఒక్కసారిగా ఇక చాలు ఆపు ఇక చాలు ఆపు నీకు అలాంటివి ఏమీ లేవు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే నేను నీ భార్యని కదా నాకు తెలుసు అని అంటూ పూజ చేయమని చెప్తుంది. అప్పుడు కార్తీక్ పూజ చేస్తూ ఉండగా దీప మౌనిత ఘర్షణ పడుతూ ఉంటారు. ఇక తర్వాత పూజ ముగిస్తుంది పంతులుగారు వెళ్ళిపోతారు. దీప సంతోషంతో థాంక్స్ డాక్టర్ బాబు నేను చెప్పినట్టు చేసినందుకు అని వెళ్లిపోతుంది. ఇక మౌనితా కోపంతో అసలు నువ్వు దాని ఇంటికి ఎప్పుడు వెళ్లావు కార్తీక్ అనగానే.. రాత్రి వెళ్లాను అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…