Guppedantha Manasu 13th July Today Episode : రిషి , వసుదార, సాక్షి, కార్లో వెళ్తుండగా,సాక్షి ఎంగేజ్మెంట్ టాపిక్ తీసుకొచ్చే మాట్లాడుతుంది. ఇదేంటి సడన్గా సాక్షి ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఇంతలో సాక్షి ఏదేదో మాట్లాడి అంతా బాగుంటే ఈపాటికి మన పెళ్లి అయిపోయి ఉండేది అని సాక్షి రిషి తో అనగానే,ఆపుతారా అని గట్టిగా వసుధార అంటోంది. దాంతో సడన్గా కార్ ఆపేస్తాడు రిషి.వసుదార ఏమైంది అని రిషి,సాక్షి ఇద్దరూ అడుగుతారు.నువు దిగిపోతావా అని సాక్షి అంటోంది.నేను దిగడం కాదు మనం ఇంటికి వచ్చే దారి మర్చిపోయి వేరేదారి కి వెళుతున్నాం అని వసుధార చెప్తుంది.
ఏంటి అసలు నాకేమైంది ఇలా ఇల్లు దాటి మరీ వెళుతున్నాను ఏమైంది నాకు అని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు. యూటర్న్ తీసుకుని కారు తిప్పి ఇంటికి వెళ్తారు.ఇంటికి వచ్చేసరికి దేవయాని, గౌతమ్, మహేంద్ర, జగతి అందరూ హాల్లోనే ఉంటారు. సాక్షి రిషీ లోపలికి రావడం చూసి షాక్ అవుతారు.దేవియాని మాత్రం రిషి , సాక్షిని చూసి చాలా ఆనందపడుతోంది. దేవయానికి సాక్షి హాయ్ చెప్తుంది. ఇంతలో వసుధార కూడా వెనుకనుండి లోపలికి వస్తుంది.వీడేంటి ఇద్దరినీ ఒకేసారి ఇంటికి తీసుకొచ్చాడు అని గౌతమ్ మనుషులో అనుకుంటూ ఉంటాడు.

ఇంతలో రిషి తను ఏంటి ఇక్కడ అని దేవియాని అడుగుతుంది.పెద్దమ్మ కాలేజ్ కి సంబందించిన వర్క్ ఉంది మన ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటారు అని దేవాలయానికి చెప్పాడు.మేడం ఆ వర్క్ మీరే చూసుకోవాలి అని జగతి తో చెబుతాడు రిషి. వెంటనే సాక్షి నువు టెన్షన్ పడకు రిషి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్తుంది సాక్షి.డాడి మీరు కూడా ఈ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వండి అని రిషి, మహేంద్రతో చెప్తాడు.సాక్షి, రిషి సార్కి దగ్గర కావాలని డ్రామాలు చేస్తుంది. మొదట నన్ను బెదిరించింది నేను లొంగకపోయేసరికి, లైబ్రరీలో రిషి సార్ని బ్లాక్ మెయిల్ చేసింది.
Guppedantha Manasu 13th July Today Episode : పనికోసం వసుధారని, సాక్షిని ఇంటికి తీసుకొచ్చిన రిషి. తర్వాత ఏం జరుగుతుంది.
అన్ని ప్రయత్నాలు అయిపోయాక రూటుమార్చుకుని ఇలా ఇంట్లోకి వచ్చేసింది. సాక్షికి, దేవయాని మేడం కూడా తోడైంది వీళ్లిద్దరి నుండి రిషి సార్ని కాపాడుకోవాలి. అని వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది.వసు ఏమాలోచిస్తున్నావు అని జగతి వసుధారతో అంటుంది.ఏం లేదు మేడమ్ ఒక పనిని బాధ్యత అని అనుకున్నాను దాని గురించే ఆలోచిస్తున్నాను అని వసుధరా చెప్తుంది.సాక్షి ఇలా రామ్మా అని దేవయాని సాక్షి ని లోపలికి తీసుకెళ్తుంది. వసుదారని కూడా జగతి లోపలికి తీసుకెళ్తుంది. ఇకపోతే మహేంద్ర, గౌతమ్ ఇద్దరు ఉంటారు.
ఏంటి గౌతమ్ అసలేం జరుగుతోంది ఇక్కడ అని మహీంద్రా గౌతమ్ తో అంటాడు. ఏదో జరుగుతుంది అంకుల్ కాని అర్థం కావట్లేదు అని గౌతమ్ చెప్తాడు.ఇకపోతే జగతి ప్రాజెక్టు విషయంలో నువ్వొచ్చావ్ వసు కానీ సాక్షి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది జగతి.మేడం సాక్షి రిషి సార్ కి దగ్గర కావాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రాజెక్టులో తనకేదో ఇంట్రెస్టు ఉన్నట్టు రిషి సార్ ని నమ్మించింది. అని చెప్తుంది వసుదార.నేను ప్రింట్ చేసి పెట్టిన ఫైల్ని నాకు తెలియకుండా తన తీసుకొని రిషి సార్ దగ్గర మార్కులు కొట్టేసింది. ఆ విషయం రిషి సర్కే చెబితే బాగుండదు అని ఊరుకున్నాను. అనే జగతి తో చెప్పింది వసుదార.
ఇలాంటప్పుడు ప్రాజెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా వుండాలంటే నేను కూడా ఉండాలి అని అనుకున్నాను మేడం. లక్కీగా రిషి సార్ నన్ను కూడా ఇంటికి రమ్మన్నారు అందుకే కాదనకుండా వచ్చేశాను అని వసుంధర తెగ తరిమేయడంతో చెప్తోంది.ఇకపోతే దేవయాని సాక్షితో నువ్వొచ్చావు సరే రిషి వసుదారని ఎందుకు తీసుకొచ్చాడు. నువ్వేం చేస్తున్నావ్ అని అడుగుతుంది దేవయాని.నేను ఆపడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు ఆంటీ అని సాక్షి చెబుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఆయన చెయ్యి ఈ ప్రాజెక్టు ముఖ్యం కాదు నువ్వు రిషి కి దగ్గర కావడం ముఖ్యం. దాని గురించి ఆలోచించు అని సాక్షి తో దేవయాని చెప్తుంది ఇలా వాళ్లిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు.
ఇకపోతే గౌతమ్, రిషి రూమ్ లోకి వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని రిషి అడుగుతారు. నువ్వూ భాష తెలియని పుస్తకం లాంటోడివి కొనుక్కోవాలి అని అనిపిస్తుంది కానీ చదవడానికి ఏం ఉండదు అని గౌతమ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అర్థమయ్యేలాగా చెప్పు అని రిషి గౌతమ్ ని అడుగుతాడు.ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఇంటికి సాక్షి వసుధార ఇద్దరూ ఎందుకు వచ్చారు, అని గౌతమ్ అడుగుతాడు. ఇదా నీ సమస్య అని రిషి అంటాడు. ముందు ఎందుకు వచ్చారో సమాధానం చెప్పు అనిఅంటాడు గౌతమ్ నీకు చదువు పండుగ గురించి తెలుసు కదా ఆ వర్క్ గురించి వచ్చారు అని చెప్తాడు రిషి.అయితే వసుదార అంటే కాలేజీలో చదువుతోంది.
మిషన్ ఎడ్యుకేషన్ గురించి తెలుసు అన్ని వివరాలు తెలియజేసింది కాబట్టి వసుధార వచ్చింది అంటే ఓకే, మరి సాక్షి ఎందుకు వచ్చింది అని గౌతమ్ అడుగుతాడు. ఇప్పుడు సాక్షికి కూడా మిషన్ ఎడ్యుకేషన్ లో ఇంట్రస్ట్ ఉంది అని వచ్చింది. అందుకే తనను కూడా ఇంటికి రానిచ్చాను అని చెప్తాడు రిషి.అలా కొద్దిసేపు రిషీ, గౌతమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సమస్యలన్నీ కొనితెచ్చుకోవద్దు అని మరీ మరీ గౌతమ్ రషితో చెప్తాడు.నువ్వు క్లారిటీగా ఉండు అని గౌతమ్ చెప్తాడు. నాకు క్లారిటీ ఉంది అని రిషి చెప్తాడు.
నా గురించి ఎక్కువ ఆలోచించకు అని చెప్తాడు రిషి,సాక్షి గురించి అనవసరమైన విషయాలు ఆలోచించుకొని నువ్వు తలనొప్పి తెచ్చుకోకు అని రిషి గౌతమ్తో అంటాడు.సరే ఇదంతా ఎందుకు లేకాని భోజనం చెయ్యడానికి వస్తావా లేదా అని గౌతమ్ అడుగుతాడు. సరే వస్తాను పద అని అనగానే గౌతమ్ వెళ్లిపోతాడు.ఇకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర జగతి, వసుధరా ఇద్దరూ భోజనం వడ్డిస్తూ ఉంటారు. అది నచ్చక దేవయాని అదేంటో కొంతమంది భోజనం వడ్డిస్తూ ఉంటే అస్సలు తినబుద్ధి కాదు అని అంటోంది.వెంటనే దానికి సమాధానంగా వసుదార ఒక సామెత చెబుతుంది దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఏంటి అని దేవియాని అడుగుతుంది.
దాంతో అంటే మేడం ఆకలి వేసినవారికి ఉడికిందా రుచిగా ఉందా అని అవసరం ఉండదు అని అర్థం మేడమ్ అని చెబుతుంది వసుదార.బాగా చెప్పావు వసుదార అని గౌతమ్ అంటాడు.వెంటనే దేవయాని సాక్షితో నువు కూడా ఏదో ఒకటి చెప్పు అని అనగానే, సాక్షి ఉప్పుకప్పురంబు నోక్కపోలికనుండు అనే సామెత చెబుతుంది దాంతో అందరూ నవ్వుతారు.ఎందుకు అందరూ నవ్వుతున్నారు అని అడుగుతుంది సాక్షి. వెంటనే జగతి అంతేకదా అక్కయ్య ఎవరికి ఏం తెలుసు అదే మాట్లాడతారు అని జగతి సమాధానం చెపుతుంది.రిషికి వసుదార అన్నం వడ్డించబోతుంటే,దేవయాని సాక్షి నువ్వు వడ్డించు అని అంటోంది.
దాంతో నేను నేను వడ్డిస్తాను అని వసుదార చేతిలో ఉన్న గిన్నెను లాక్కుపోతుంటే వాటర్ గ్లాస్ రిషి మీద పడిపోతుంది.రిషి వెళ్లి క్లీన్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు. వెంటనే దేవయాని పాపం రిషి చూసుకోలేదు అని చెప్తుంది.సాక్షి నువ్వు ఏం ఫీలవ్వకు చూసుకోలేదుకదా అని తనతో చెప్తుంటే,అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే మహేంద్ర వాసుదార నువ్వు వచ్చి కూర్చో అమ్మ అనే పిలుస్తాడు వసుదార కూర్చుంటుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు సాక్షి మాత్రం రిషి వైపు వసుదార వైపు కోపంగా చూస్తోంది.
రిషి ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు అని అడగ్గానే,మహేంద్ర బాబు గౌతమ్ ఏదైనా పాట పాడు అని అంటాడు. ఇప్పుడు కాదు అంకుల్ బాగా తిన్న తర్వాత పాడుతాను అని గౌతమ్ అంటారు .భోజనం తినడం అయిపోగానే వర్క్ మీద కూర్చుందాం అని రిషి అంటాడు.మేడం ఇక్కడ కూడా ఆర్డర్సు వేస్తున్నారు ఇది ఇల్లా కాలేజీ అని వసుదార జగతి తో అంటోంది.హలో ఏంటి ఏదో అంటున్నావు అని అడుగుతాడు రిషి. గట్టిగా చెప్పే మేం కూడా వింటాం వసుదార అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదు అని చెప్తుంది వసుదార.అందరూ భోజనం తినడం అయిపోతుంది తర్వాత ప్రాజెక్ట్ పని మొదలుపెడతారు.
మెషీన్ ఎడ్యుకేషన్లో భాగంగా చదువుల పండగ అనే కొత్త ప్రాజెక్టు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషి నాకు కొన్ని ఐడియాలు వున్నాయి అని సాక్షి చెప్తుంది.ఈ చదువుల పండగ గురించి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి బ్యానర్లు వేసి సిటీలో అన్నిచోట్లా అంటించి. అందరికీ తెలిసేలాగా చేద్దాం అని సాక్షి చెప్తుంది. అప్పుడు అందరికీ దాని గురించి తెలుస్తుంది అని చెప్పగానే అవును ఎస్ అని రిషి అంటాడు.వెంటనే వసుదార సార్ మనం చేసే పనిలో బాధ్యత కనిపించాలి కానీ హంగులు ఆర్భాటాలు కనిపించకూడదు సార్ అని వసుధార రిషితో చెప్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది