Guppedantha Manasu 14 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 14-September-2022 ఎపిసోడ్ 555 ముందుగా మీ కోసం. క్యారమ్స్ ఆట ఆడటం మొదలుపెడతారు. రిషి జగతితొ మేడం కైన్ ఇలా కొట్టండి, మనమే గెలుస్తాం అని దగ్గరుండి చెబుతూ ఉంటాడు, రిషి చెప్పినట్టు జగతి కైన్ వేస్తుంది. రిషి సంతోషంతో మనమే గెలిచాం మేడమ్ అని, కంగ్రాచులేషన్స్ మేడమ్ అని అంటాడు. ఇలా వీళ్లు సంతోషంగా ఉండడాన్ని చూసి మహేంద్ర, వసుధరా ఇంట్లో అందరూ సంతోషపడతారు.కానీ దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది.తర్వాత వసుధార రూమ్లోకి వెళ్లి, డ్రెస్ లు చూసుకుంటూ, ఏది వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇలా ఆలోచించేదాన్ని కాదు, ఇప్పుడు రిషి సార్ చూస్తారు కదా అని ఆలోచిస్తూండగా, రిషి అక్కడికి చీర తీసుకొని వస్తాడు.నీ కోసం ఇది తెచ్చాను అనగానే, వసుధార ఒకప్పుడు వసుధార చీర కట్టుకొని ఇబ్బంది పడుతుంటే ఎందుకు కట్టుకున్నావ్ అని రిషి అన్న మాటను గుర్తు తెచ్చుకొని, సార్ మీరే కదా ఆ రోజు అన్నది అని అనబోయే లోపలే, ఇంకేం మాట్లాడకు ఇదే కట్టుకొ, నీకు బాగుంటుంది అని చెపుతాడు.
Guppedantha Manasu 14 September 2022 Episode : వసుధార కోసం చీరని కొనితెచ్చిన రిషి
థ్యాంక్యూ సర్ అని అంటుంది.ఒకవైపు దేవయాని దగ్గరికి ఫణీంద్ర వచ్చి, నగలు ఇస్తాడు ఇవి జగతి నగలు, ఆ రోజు నువ్వు తీసుకున్నావు, ఈ రోజు పెళ్లి రోజున తిరిగి జగతికి ఇచ్చేయ్ అని చెప్పి వెళ్లిపోతాడు, ఇంతలో రిషి వస్తాడు, ఏంటి పెద్దమ్మా ఈ నగలు అని అనగానే, కొంపదీసి రిషి వినలేదుగదా, కొంచెం ఉంటే దొరికిపోయేదానిని అని అనుకుంటూ, ఇవి నావే రిషి మీ పెదనాన్న జగతికి ఇవ్వమన్నాడు, అయినా తనకి మాత్రం ఎవరున్నారులే మనం తప్పా అని అంటూ ఉంటుంది, ఇంతలో రిషి గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు, దేవయాని రిషికి అబద్ధం చెపుతోంది మీ అమ్మ కావాలని నగదు తీసుకోవడానికి వచ్చింది, నీకు జ్వరం ఉంది అన్నా కూడా పట్టించుకోలేదు అని చెబుతుంది చిన్నవయసులో, దాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడతాడు, ఇంతలో గౌతమ్ వస్తాడు రిషి దగ్గరికి, డల్లుగా ఉండడం చూసి, ఏమైందిరా అనగానే, ఏమీ లేదు అని అంటాడు గౌతమ్ తొ,తర్వాత దేవయాని జగతి దగ్గరికి వెళ్లి నగలు ఇస్తుంది, ఇలా కొద్దిసేపు వాళ్లు మాట్లాడుకుంటారు, జగతి నగలను తీసుకొంటుంది.

తర్వాత రోజు సెలబ్రేషన్స్ మొదలవుతాయి, రిషి మహీంద్రా, జగతికి కేక్ తినిపిస్తాడు, ఇంట్లో అందరికీ తినిపిస్తాడు, కానీ వసుధారకి తినిపించాడు, దాంతో వసుధార సార్ నాకెందుకు కనిపించడం లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది, తర్వాత డిన్నర్ టైమ్ అవుతోంది, వసుధార ఎక్కడా అని రిషి ధరణితో అనగానే, తనకి ఆకలిగా లేదంట రిషి అని అనడంతో, గౌతమ్ అదేంటి, నువ్వే అడుగు రిషి అని రిషిని పంపిస్తాడు. రిషి వసుధార దగ్గరికి వెళ్ళి ఏమైంది వసుధార అనగానే, మీకు మీ వాళ్ళు ముఖ్యం కదా సార్ అనడంతో, రిషికి అర్థమవుతోంది కేక్ తినిపించ లేదని ఇలా ఉంది అని, సైలెంటుగా వెళ్ళిపోతాడు, అదేంటి నేను ఆకలి అవ్వటం లేదు అంటే, కారణం కూడా అడక్కుండా వెళ్లిపోయాడు రిషి సార్ అని అనుకుంటూ ఉంటుంది, ఇంతలో రిషి అన్నం ప్లేట్ను తీసుకుని వస్తాడు, నేను తినను సార్, నేను మీ మీద అలిగాను అనడంతో, ఎందుకు అనగానే, మీరు ఇంట్లో అందరికీ కేక్ తినిపించారు కానీ నాకు తినిపించ లేదు అని అంటోంది. నువ్వు ముందు అన్నం తిను అని, ఇలా సరదాగా వసుధారని ఏడిపిస్తూ ఉంటాడు ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.