Guppedantha Manasu 17 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 17-September-2022 ఎపిసోడ్ 558 ముందుగా మీ కోసం. సంతోషంగా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, అందరూ భోజనం చేస్తూ ఉంటారు, రిషి, వసుధార కి స్వయంగా వడ్డిస్తూ ఉంటాడు, ఇది తిను వసుధార అంటూ, వసుధార పక్కనే నిలబడి తింటూ ఉంటాడు, గౌతమ్ వస్తాడు అక్కడికి, గౌతమ్ ని పంపించి, రిషి వసుధారతోపాటు తింటూ వుంటాడు, దాన్ని గమనించిన జగతి నవ్వుకుంటూ ఉంటోంది, వసుధార తింటూ ఉంటే అన్నం అంటటంతో తనే తుడుస్తాడు, ఇలా వీళ్లు సంతోషంగా ఉండడాన్ని గమనించి, జగతి మహేంద్ర కూడా చాలా సంతోష పడతారు, ఇంతలో అతిథులందరూ వెళ్ళిపోయాక, దేవయాని తన కుట్రను ప్రయోగిస్తోంది. కుటుంబ సభ్యుల ముందు నాకు సంతోషంగా ఉంది దీనంతటికి కారణం వసుధార అని వసుధర దగ్గరికి వెళ్లి, నువ్వింత మంచిదానివి అనుకోలేదు నిన్ను అపార్థం చేసుకున్నాను అని, తనని పొగడడం మొదలుపెడుతుంది.
నేనేం చేశాను మేడం అని అనడంతో, గొప్పవాళ్లు అంటే అమ్మ ఒప్పుకోరు పొగడ్తల్ని అంటూ, రిషి జగతిని ఇలా దగ్గర చేస్తానని మహేంద్రకి మాట ఇచ్చావు కదా, అమ్మా అని కూడా పిలిపిస్తే ఆ బాధ్యత అయిపోతుంది, గురుదక్షిణ చెల్లించినట్టు అవుతుంది, నువ్వింత తెలివైనదానివి అనుకోలేదు, ఒకప్పుడు రిషి ఎలా వుండేవాడో, తన కోపం చూస్తే నాకే భయమేసేది, కానీ ఇప్పుడు తనను చాలా మార్చావు రేపో మాపో అమ్మా అని పిలిచాక,వసుధార ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మ నాన్నతో మాట్లాడి, కోడలిగా చేసుకుందాం అని ఇలా వెటకారంగా అందరి కుటుంబ సభ్యుల ముందు మాట్లాడుతూ ఉంటుంది, జగతి ఆపినా కూడా ఆగదు, పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండగా, పెద్దమ్మా అని గట్టిగా అరుస్తాడు రిషి,దయచేసి ఏమీ మాట్లాడకండి అని అంటాడు రిషి.నేను చెప్పినదాంట్లో ఒక్కమాట కూడా అబద్ధం లేదు, నేను చెప్పింది చెప్పిన గురుదక్షిణ అబద్ధమని వసుధారని ఒక్కమాట చెప్పమను అని అనడంతో రిషి వసుధార వైపు చూస్తాడు.
Guppedantha Manasu 17 September 2022 Episode : గురు దక్షిణ విషయం గురించి కుటుంబం ముందు బయటపెట్టిన దేవయాని
వసుధార సైలెంట్ గా ఉంటుంది దాంతో రిషి కి కోపం వస్తుంది. వసుధార ఆపిన కూడా ఆగకుండా, అక్కడి నుంచి వెళ్లిపోతాడు, దేవయాని జగతి దగ్గరికి వెళ్లి, ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా మీరు మాట్లాడుకుంటే విన్నాను అని చెబుతోంది. రిషి వెళ్లిపోవడంతో వసుధర చాలా బాధపడుతోంది జగతి మహేంద్ర తనని ఓదార్చిన ఆపినా కూడా ఆగకుండా ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఒకవైపు రిషి రోడ్డుపైన నడుస్తూ వెళుతూ, ఒక పెద్ద కాలేజ్, పెద్ద కుటుంబం అందరూ ఉన్నా నేను ఒంటరివాణ్ని అని అనుకుంటుా, దేవయాని అన్న మాటలని, కేవలం వసుధార మిమ్మల్ని దగ్గర చేయడం కోసమే నీతో అలా వుంది ప్రేమగా అని అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు, అలా రిషి వెళ్లడాన్ని వసుధరా చూసి రిషి దగ్గరికి వెళ్లి, సార్ నేను మీతో మాట్లాడాలి అని అడుగుతుంది, రిషి వెల్లు వసుధార నీతో మాట్లాడను అని కోపంగా చెప్పడంతో, వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది, ఒకవైపు మహేంద్ర, గౌతమ్ కూడా రిషి కోసం వెతుకుతూ ఉంటారు, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.