Karthika Deepam 17 September Today Episode : మౌనితకి రీకౌంటర్ ఇవ్వబోతున్న వంటలక్క… కార్తీక్ కి గతం గుర్తు చేస్తున్న దీప…

Karthika Deepam 17 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1460 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… డాక్టర్, పెద్దావిడ దీప గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. అందులో దీప అక్కడికి వస్తుంది. అప్పుడు మందు కోసం వెళ్లకుండా ఎక్కడికొచ్చావ్ ఏంటి అని అడగగా.. మందు లేదు పాడు లేదు అన్నయ్య ఆటో డ్రైవరు నాకు నిజమంతా చెప్పాడు అక్కడ ఏమి లేదని ఇదంతా దాని డ్రామా నన్ను ఊరు పంపించేసి అది కార్తీక్ తీసుకొని రెడీ అయిన వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అప్పుడు దీని మాయలు మామూలుగా లేవు నువ్వు దాని మీద ఒక కన్నేసి ఉండాలి. నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. కట్ చేస్తే మౌనిత ఆనంద్ కోసం వెళ్తూ శివాకి కార్తీక్ ని మంచిగా చూసుకోమని చెప్తూ ఉంటుంది. అప్పుడు శివ మౌనితని ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు మేడం కార్తీక్ గారిని కూడా తీసుకెళ్లొచ్చుగా అని అడుగుతుండగా… అయితే చెప్తాను ఇక నీ జాబు మానేసి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు శివ క్షమించండి మేడం ఇక నేను ఎప్పుడూ అలా అడగను నా జాబు తీసేయొద్దు మేడం అని బ్రతిమిలాడతాడు.

Advertisement

అప్పుడు ఇలాగే ఉండు.. నీ తోక వంకర తిరిగితే నీ జాబు కూడా వంకరా తీరుగుతుంది అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గండ ఇంటికి సరుకులు తీసుకొని వస్తాడు.అప్పుడు శౌర్య సరుకులను చూసి ఇన్ని సరుకులు తెచ్చావేంటి బాబాయ్ అని అడగగా చంద్ర పక్కింటికి బంధువులు వచ్చారంట వాళ్లకి వంటలు చేయాలంట అని అంటుంది. అప్పుడు డబ్బులు ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు చంద్ర ఇస్తారు కానీ వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకోవడం అని అంటుంది. అప్పుడు సౌర్య మా అమ్మ కూడా ఇలాగే ఎంత ఇస్తే అంతే తీసుకునేది డిమాండ్ చేసేది కాదు అని అంటుంది. అప్పుడు చంద్ర మీ అమ్మ అంత మంచిది కాబట్టి దేవుడు తొందరగా తీసుకెళ్లాడు అని చెప్తుంది. అప్పుడు శౌర్య చంద్ర, గండమీద కోప్పడుతుంది. దీప రాసిన లీస్ట్ ను చూసి ఇది మా అమ్మ రాసిన చేతిరాతే అని అంటుంది. అప్పుడు గండ అవునా అని అంటాడు. అప్పుడు సౌర్య అమ్మ ఉంది మా అమ్మ చేతి రాత ఇదే? నేను కచ్చితంగా వెతుకుతాను మా అమ్మ దొరికే వరకు వెతుకుతాను అని అంటుంది.

Advertisement

Karthika Deepam 17 September Today Episode : మౌనితకి రీకౌంటర్ ఇవ్వబోతున్న వంటలక్క…

Karthika Deepam 17 September Today Episode
Karthika Deepam 17 September Today Episode

అప్పుడు చంద్ర, గండ సౌర్య వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆనందరావు, సౌందర్య, హేమ కారులో వెళ్తూ మౌనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హిమ మోనిత ఆంటీ ఆనంద్ ని ఎవరికీ ఇవ్వద్దని చెప్పిందంట మీరు వెళ్తే ఇస్తుందా నాయనమ్మ అని అంటుంది. అప్పుడు సౌందర్య నా మనవడిని అది ఇచ్చేది ఏంటి నాలుగు పీకి తీసుకొస్తాను అని అంటుంది. కట్ చేస్తే మౌనిత వచ్చి ఆనంద్ ని తీసుకెళ్తూ ఉండగా ఆనంద్ ని పెంచిన అమ్మానాన్నలు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు మౌనిత నేను కొన్ని రోజులు ఉంచుకొని మళ్లీ తీసుకొచ్చి ఇస్తా అని అంటుంది. ఆస్తిని మాత్రం తీసుకెళ్ళను అని అంటుంది. అప్పుడు బాబె లేడు మాకు ఆస్తి ఎందుకమ్మా.. నువ్వే తీసుకెళ్ళు అని అంటారు. అలా వాళ్ల దగ్గర నుంచి మౌనిత ఆనంద్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. అంతలో సౌందర్య, హేమ, ఆనంద్ రావు అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళని ఆనంద్ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు వాళ్లు ఇప్పుడే మౌనితామ్మ వచ్చి తీసుకెళ్ళింది అమ్మ అని అంటారు.

అప్పుడు మీ దగ్గర ఎందుకు వచ్చింది మళ్ళీ ఎందుకు తీసుకెళ్లింది. అసలు తన ఎక్కడుంటుంది అంట అని అడిగా అడుగుతుంది సౌందర్య. అప్పుడు ఏమోనమ్మా చెప్పలేదు. అని అంటారు. అప్పుడు సౌందర్య మళ్ళీ మౌనితా వస్తే మాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీప కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కార్తీక్ పాటలు పాడుకుంటూ సరదాగా ఉంటాడు. అప్పుడు శివ మీ సంతోషాన్ని కారణం నాకు తెలుసు సార్ మేడం ఊరెళ్ళారుగా అందుకే సంతోషంగా ఉన్నారు కదా అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఒక్కటి పీకి మీ మేడం ఈ మాటలు విన్నారంటే ఎంత బాధ పడుతుంది. అలా మాట్లాడితే ఏంటి అని అంటాడు. అప్పుడు శివ బయటకి వస్తుండగా దీప ఎదురుగా వస్తుంది. దీపని లోపలికి వెళ్ళనీయకుండా ఆపుతాడు. అప్పుడు దీప ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటుంది. దీపా తనతోనే మౌనితా ఎక్కడికెళ్ళింది.? ఎప్పుడు వస్తుంది.? అని చేపిస్తుంది. దీప డాక్టర్ బాబుకి భోజనం కావాలి ఏమో అడుగుతా అని అంటూ ఉండగా.. శివ వద్దు మేడం అవన్నీ నేను చూసుకుంటాను అని శివ అంటూ ఉంటాడు. అప్పుడు దీప అక్కడినుంచి వెళ్తూ నీ పని చెప్తాయిగా అని మౌని తాని తిట్టుకుంటూ వెళ్లిపోతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement