Karthika Deepam 18 September Today Episode : దీప చెప్పిన మాటలకి గతం గుర్తుతెచ్చుకుంటున్న కార్తీక్… ఆశ్చర్యపోతున్న శివ…

Karthika Deepam 18 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులు నీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1461 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మోనిత ఎల్లి ఆనంద్ ని తీసుకొని వస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి సౌందర్య వాళ్లు వచ్చి ఆనంద్ ని పెంచిన తల్లిదండ్రులని ఆనంద్ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు ఇప్పుడే మౌనితామ్మ వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పగానే.. వాళ్లు బాధపడుతూ తను మళ్ళీ వస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీప కార్తీక్ దగ్గరికి వెళ్తూ ఉండగా.. శివ తనని ఆపుతాడు. అప్పుడు దీప మీ సార్ కి భోజనం కావాలేమో నేను అడుగుతాను అని అంటుండగా.. ప్లీజ్ వంటలక్క అవన్నీ నేను చూసుకుంటాను. మా మేడం కి తెలిస్తే నన్ను జాబ్ లో నుంచి తీసేస్తుంది అని అంటాడు.

అప్పుడు దీప నిన్ను ఏ విధంగా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అని నేను మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మౌనిత లేదు రేపటి వరకు రాదు అని తెలుసుకున్న దీప కార్తీక్ కోసం ఒక ఎత్తుని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్లి బిర్యాని వండుతూ ఉంటుంది. ఆ వాసన చూస్తున్న కార్తిక్ వంటలక్క బిర్యాని చేస్తుంది. ఎలాగో మీ మేడం లేదు. కాబట్టి మనం వెళ్లి తినేసి వద్దామని శివాని తీసుకొని దీప ఇంటికి వెళ్తాడు. అప్పుడు దీప కార్తీక్ బిర్యానీ వడ్డిస్తూ.. అన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మెల్లమెల్లగా గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తనకి జరిగిందంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. గతం గుర్తు చేసుకుంటూ ఉండగా కార్తీక్ తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దీప కార్తీక్ కి తల కి జండుబాం పెట్టి మసాజ్ చేస్తూ… నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Karthika Deepam 18 September Today Episode : దీప చెప్పిన మాటలకి గతం గుర్తుతెచ్చుకుంటున్న కార్తీక్…

Karthika Deepam 18 September Today Episode
Karthika Deepam 18 September Today Episode

మీ అమ్మ సౌందర్య మీ నాన్న ఆనంద్ రావు నీ భార్య దీప అని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఒక డాక్టర్ అని చెప్తూ ఉండగా.. అది కార్తీక్ గతంలోకి వెళ్లిపోతాడు. దాంతో దీప తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక శివ కూడా ఆ మాటలన్నీ విని అయితే మా మౌనిత మేడం ఒక పెద్ద మాయలాడి సార్ ని ఆమె ట్రాప్ లో పెట్టింది అని అనుకుంటూ ఉంటాడు. వంటలక్కకి మద్దతు ఇస్తూ ఉంటాడు. కట్ చేస్తే సౌర్య, గండ నీ నిన్న మా అమ్మ నీకు ఎక్కడ కలిసింది. ఎక్కడ దిగింది అని అడుగుతూ మళ్లీ అక్కడికే వస్తుంది. బాబాయ్ మనం వెళ్దాం పద అని చెప్తుంది. అప్పుడు గండ నువ్వు ఎవరి గొంతు విని భ్రమ పడుతున్నావమ్మా మీ అమ్మాయి ఉంటే నిన్ను వెతకకుండా తన భర్త కోసం మందు తీసుకొస్తాను.. అని ఎలా వెళ్తుంది అని అంటాడు. అప్పుడు సౌర్య ఏమో మా నాన్నకి ఒకవేళ బాగా లేదేమో అందుకే మందు తీసుకురావడానికి వెళ్ళిందేమో అని వెళ్దాం బాబాయ్ అని చెప్తూ ఉండగా.. సరే అని గండ తీసుకొని వెళుతూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…