Guppedantha Manasu 30 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 30-September-2022 ఎపిసోడ్ 569 ముందుగా మీ కోసం. మహేంద్ర, గౌతమ్, జగతి ముగ్గురు రిషి, వసుధార లను ఎలా దగ్గర చేయాలో అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడు మహేంద్ర, జగతితో ఇలా ఉంటూ ఉంటాడు వీళ్ళిద్దర్నీ దగ్గర చేయడానికి ఐడియా ఉంటే చెప్పు అని, ఏమైనా కాలేజ్లో మీటింగ్స్ పెండింగ్ ఉన్నాయా అని అనగానే, జగతి చూసి చెబుతాను మహేంద్ర అని అంటోంది, తరవాత రిషి కట్టు విప్పుకుంటూ, వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అక్కడికి మహేంద్ర కాఫీ తీసుకుని వస్తాడు, కట్టు నేను విప్పుతాను రిషి అని చెప్పి, కాఫీ తాగమని అంటాడు, మీరు కాఫీ తేవడం ఏంటి డాడీ అని అనగానే, నీతోపాటు ఎక్కువసేపు ఉండాలని నాకు అనిపిస్తుంది అంటూ, ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ, కాలేజ్ లో మీటింగ్ ఉంది మేము వెళుతున్నాం నీకు హెల్త్ బాలేదు కదా అని మహేంద్ర అనగానే, పర్వాలేదు డాడీ నేను వస్తాను, దేని గురించి మీటింగ్ అని రిషి అడుగుతాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి మేల్ జగతికి అప్పుడు ఎగ్జామ్స్ సమయంలో వచ్చింది, దానిని పట్టించుకోలేదు దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామని పెట్టాము మీటింగ్ అని అనగానే, హాలిడేస్లో మీటింగ్ పెట్టడం మంచిదేలే డాడ్ అని నేను వస్తాను అని చెబుతాడు.
Guppedantha Manasu 30 September 2022 Episode : రిషికి చెప్పకుండా విద్యాశాఖలో కోఆర్డినేటర్గా జాబ్లో జాయిన్ అయిన వసుధార, కోపంగా రిషి
రిషి తన ఛాంబర్లో వసుధార జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, అప్పుడు జగతి అక్కడికి ఫైలు తీసుకుని వస్తుంది, ఒకసారి ఈ ఫైల్ చూడండి సార్ అని, ఇప్పుడు నేను చూడలేను మేడమ్ అని రిషి అంటాడు, విద్యాశాఖలోని ఒక కోఆర్డినేటర్ వస్తారు, కొత్త ప్లానింగ్ ఎక్స్ ప్లెయిన్ చేయడానికి అని చెపుతుంది జగతి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు అక్కడికి వసుధార వస్తుంది కోఆర్డినేటర్గా, తన ఐడియాను ఎక్స్ప్లైన్ చేస్తూ ఉంటుంది, రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు తనకు చెప్పకుండానే విద్యాశాఖలో కోఆర్డినేటర్గా జాబు లో జాయిన్ అయ్యింది అని కోపంగా ఉంటాడు. కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చెయ్యాలి సార్ అని అనగానే, జగతి మేడం చూసుకుంటారు అని రిషి వసుధారతో అంటాడు, మీరే చేయాలి సార్ అని అనగానే రిషి ఒక్కసారిగా లేచి చేర్ని పట్టుకుంటాడు, చేతికి తగిలిన దెబ్బ తో బాధపడుతూ ఉంటారు, రిషి జాగ్రత్త అని మహేంద్ర, అందరూ అంటూ ఉంటారు, పర్వాలేదు అని చెప్పి వెళ్లిపోతాడు అక్కడ నుంచి, ఒకవైపు దేవయాని గౌతమ్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

రిషి వసుధారల గురించి కానీ గౌతమ్ ఏమి చెప్పాడు తెలివిగా, దాంతో దేవయాని అనుకుంటూ ఉంటుంది ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటారొ నేను చూస్తాను అని, తర్వాత మహేంద్ర మినిస్టర్ కి కాల్ చేసి ధన్యవాదాలు చెబుతాడు, మిషన్ ఎడ్యుకేషన్ గురించి అడగగానే ప్రభుత్వం తరపున వసుధారకి జాబ్ ఇచ్చినందుకు అని అనగానే, మినిస్టర్ గారు వసుధార లాంటి తెలివైన అమ్మాయి మిషన్ ఎడ్యుకేషన్లో ఉండడం అవసరం అంటూ ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, తర్వాత రిషి, వసుధారాణి ప్రశ్నిస్తూ ఉంటాడు, నువ్వు మినిస్టర్ గారి దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి, నాకు చెప్పాలి కదా అని అనగానే, సార్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అని ఇంటర్వ్యూ జరుగుతుంటే, ఔట్సోర్సింగ్ జాబ్ అని వెళ్లాను అని అంటుంది, నాకు చెప్పాలి అని అనిపించ లేదా అని రిషి అనగానే, జాబు వస్తాదొ రాదొ అని చెప్పాలేదు సార్ అని వసుధార అంటోంది, అప్పుడు రిషి నా దగ్గర అసిస్టెంటుగా చేసే దానివి గుర్తుందా అని అనగానే, అప్పుడు జీతం తీసుకున్న అసిస్టెంట్స్ని, ఇప్పుడు జీతం తీసుకోకుండా జీవితాంతం నడిచే అసిస్టెంట్ని సార్ అని అంటూ ఉంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.