Karthika Deepam 30 September Today Episode : మోనిత కి చుక్కలు చూపిస్తున్న దుర్గ… మౌనిత, దుర్గని క్లోజ్ గా చూసి మండిపోతున్న కార్తీక్..

Karthika Deepam 30 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1471 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దుర్గ మౌనితని ఫాలో అవుతూ వస్తాడు. కానీ మౌనిత మిస్ అవ్వడంతో అయితే ఇక్కడే ఉంటుంది. అని అనుకోని రేపు ఉదయం వస్తా దీనికి సంగతి చూస్తా అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక మౌనిత, దుర్గ గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. వీళ్లేంటి ఒకరి తర్వాత ఒకరు దాడి చేస్తున్నట్టు నాకే ఎందుకు కనిపిస్తున్నారు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిగా కాదు అందరూ కట్టకట్టుకుని వచ్చిన నన్నేమీ చేయలేరు.. ఎందుకంటే కార్తీక్ గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే కార్తీక్ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి.. ఇక దీప ఆ పని చేయదు ఎవరిని చేయనీయదు ఇక కార్తీక్ జీవితాంతం మోనిత మౌనిత అంటూ ఉంటాడు అని అనుకుంటూ ఉండగా… అంతలో కార్తీక్ దీప దీప, సౌర్య, రౌడీ అనే కలవరిస్తూ ఉంటాడు. ఇక మౌనిత కార్తీక్ ను చూసి గతం గుర్తొచ్చిందా అని భయపడుతూ ఉండగా శివ కూడా అక్కడికి వస్తాడు. కార్తీక్ అలా అనడం చూసి శివ హనుమాన పడుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత శివ అక్కడ నుంచి పంపించేస్తుంది. కార్తీక్ అలా కలవరించడం చూసి భయపడిపోతూ ఉంటుంది.

Advertisement

కట్ చేస్తే దుర్గ మౌనితని వెతుక్కుంటూ మౌనిత ఇంటికే వస్తాడు. అప్పుడు దీప అనిపిస్తుంది. ఇక దుర్గ ను చూసిన దీప సంతోషంతో దేవుడా నా కోసం దుర్గని పంపించావా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దుర్గ నువ్వేంటి దీపమ్మ ఇక్కడున్నావేంటి అని అడగగానే దీప జరిగిందంతా చెబుతుంది. ఇక దుర్గ ఇంత పని చేసిందా ఇదంతా ఎలా తట్టుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. ఇక దీప జరిగినంత చెప్పగానే దుర్గా అది ఆ ఎదిరింట్లోనే కదా ఉండేది. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కార్తీక్ తలనొప్పిగా ఉంది తల మసాజ్ చెయ్ అని అంటూ ఉంటాడు. ఇక మౌనిత మాత్రం తల మసాజ్ చేయకూడదు నీకు మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఒక డాక్టర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి మౌనిత కంగారుపడుతూ ఉంటుంది. అంతలో దుర్గ వచ్చి హలో మేడం అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత దుర్గని చూసి కంగారుపడుతూ దుర్గ దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇప్పుడు ఏం బాగాలేదు.. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా ఇకనుంచి వెళ్ళిపో అని బ్రతిమిలాడుతూ ఉంటుంది.

Advertisement

Karthika Deepam 30 September Today Episode : దుర్గని క్లోజ్ గా చూసి మండిపోతున్న కార్తీక్..

Karthika Deepam 30 September Today Episode
Karthika Deepam 30 September Today Episode

అప్పుడు దుర్గ మోనిత తో రొమాంటిక్ మిక్స్ చేసి మౌనితను ఒక ఆట ఆడుకుంటాడు. ఇక మోనిత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు పోరా అని అంటూ ఉంటుంది. ఇక అలా కొద్దిసేపు తర్వాత దీప దగ్గరికి వచ్చి నీకేం బాధ లేదు ఇక నేను వచ్చాను.. నిన్ను కార్తీక్ బాబుని కలిపి బాధ్యత నాది.. ఇక మౌనిత నా భార్య కాదు.. దీపనే నా భార్య అని నేను చెప్పిస్తా అని అంటాడు. ఇక చాలా థాంక్స్ దుర్గ అని అంటుంది. నాకు థాంక్స్ ఎందుకు చెప్తున్నావు ఇక కార్తీక్ ని మార్చే బాధ్యత నాది అని అంటాడు. కట్ చేస్తే కార్తీక్ శివ అని పిలుచుకుంటూ వచ్చి ఏంటి మోనితో కంగారుపడుతున్నావ్ అని అనగానే కార్తీక్ ఇల్లు మారిపోదాం అని చెప్తూ ఉంటుంది. ఇక శివ శివ అని బయటికి వస్తుండగా.. కింద పడిపోయి ఉండగా చూసి.. మౌనిత అని పిలిచి శివ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. నీళ్లు తీసుకురా అని అని పిలుస్తూ… డాక్టర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు శివలేసి దుర్గ గురించి చెప్తాడు.

అప్పుడు దుర్గ గురించి మోనితా అని అడుగుతూ ఉంటాడు. అంతలో దుర్గ వచ్చి ఒక డ్రామా ప్లే చేస్తూ ఈ దూర బంధువు ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటాడు. అంతలో దీప తమ్ముడు శివ గోంగూర పచ్చడి కావాలన్నావ్ కదా తీసుకొచ్చాను అని చెప్తూ.. ఈనెవరు మీ బంధువా డాక్టర్ బాబుఅని అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ బాబు మౌనిత బంధువట అని చెప్తూ ఉంటారు. ఇక దుర్గ మౌనితకు నామీద కోపం పోలేదు.. నేను వెళ్లి హోటల్లో ఉంటానులే అని అంటుండగా.. కార్తీక్ పిలిచి మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో దుర్గని ఇంట్లో నుంచి వెళ్లిపోమని బెదిరిస్తూ ఉంటుంది మౌనిత. అప్పుడు దుర్గ మౌనిత చేయి పట్టుకొని రొమాంటిక్గా మాట్లాడుతూ ఉండడం చూసిన కార్తీక్ వంటలక్క దగ్గరికి వెళ్లి కూర్చొని ఉండగా.. శివ వచ్చి మేడం మిమ్మల్ని సరదాగా రెండు గంటలు బయట తిప్పుకొని రమ్మన్నారు.. అలాగే సినిమా కూడా వెళ్ళమన్నారు అని చెప్తూ ఉండగా.. అప్పుడు కార్తీక్ ఏం జరుగుతుంది. ఎప్పుడూ ఇలాగే జరిగేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement