Guppedantha Manasu 5 July Today Episode : గుప్పెడెంత మనసు సీరియల్ 5-7-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం

Guppedantha Manasu 5 July Today Episode : రాంగ్ రూట్లో వెళ్తే నీకే ప్రమాదం అని వస్తారా, సాక్షితో చెప్తుంది. అందని వాటిని అందుకోవడంలో ఒక కిక్ ఉంటుందని సాక్షి అంటుంది. అప్పుడు వసుధరా మూర్ఖులకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు.కొంత మందికి ఒక్కసారి చెప్తే అర్థంఅవుతుంది కొంతమందికి రెండుసార్లు చెప్పే అర్థమవుతుంది కానీ మూర్ఖులకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని మా జగతి మేడం చెప్పింది అని వసుధార సాక్షితో అంటోంది.ఒకరు చెబితే వినడం ఒకరితో తెప్పించుకోవడం నాకు అలవాటు లేదు,నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని సాక్షి అంటుంది.కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిది కాదు అని వసుధార అంటుంది.

మనం వెళ్లే దారిలో ధర్మం, న్యాయం ఉంటే ఎప్పటికైనా గెలుస్తాం, అని వసుధార సాక్షితో అంటోంది.నా దగ్గర ప్రేమ ఉంది అని సాక్షి అంటోంది ప్రేమ అనేది లైబ్రరీలో దొరికే పుస్తకం కాదు దాన్ని ఒకరి దగ్గర నుండి కొనుక్కోలేము ఒకరు దగ్గర్నుంచి కొట్టేయలేము అని వసుధరా అంటుంది.ప్రేమ అనేది స్వతహాగా పుట్టాలి బలవంతంగా కలిగేది కాదు ప్రేమ అనేది మనిషి పదం దాన్ని కలుషితం చేయొద్దు సాక్షి అని వసుధరా గట్టిగా చెప్తోంది .దాంతో సాక్షి ఒక్కసారి గెలవగానే గెలిచినట్టుకాదు ఇకపైన రాబోయే గెలుపు నాదే నవ్వు చూస్తూ ఉండు అని సాక్షి, వసుధార తో అంటుంది. వద్దు అంటే వినలేదు, నీవల్ల కాదు అంటే వినలేదు,ఇది తప్పు అంటే వినలేదు, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే నీకింకా ఎలా చెప్పాలి మెడమీద చెయ్యి పెట్టి ఇది తప్పు అని చెప్తే తప్ప నీకు అర్థం అయ్యేలా లేదు అని వసుధార సాక్షితో అంటోంది.

Guppedantha Manasu 5 July Today Episode
Guppedantha Manasu 5 July Today Episode

అక్కడి నుండి వసుధార క్లాస్ కి వెళ్తుంది క్లాస్ కి వెళ్లగానే తన క్లాస్ మేట్స్ అందరూ వసుధారకు కంగ్రాట్స్ చెప్పారు. అందరూ కలిసి పార్టీ ప్లాన్ చేద్దామనుకున్నాం వసుధార అంటూ పుష్ప అంటుంది. ఈ మాత్రానికే పార్టీ ఎందుకు అని వసుధార అంటుంది. ఇంతలో క్లాస్ చెప్పడానికి జగతి మేడం వస్తుంది.వసుధార అవును ఇంతకీ మళ్లీ సాక్షి దేనికి వచ్చింది మళ్లీ ఏ సమస్య వస్తుందో అని ఆలోచిస్తుంది, వసుధార జగతి మేడం పర్మిషన్ తీసుకొని క్లాస్ నుండి బయటకు వెళ్తోంది. సాక్షి , రిషి దగ్గరికి వెళ్తుంటే మహేంద్ర చూసి తన వెనకాలే వెళ్తాడు, సాక్షి రిషి దగ్గరికి వెళ్లి న్యూస్ పేపర్ ని విసిరేస్తుంది. సాక్షి ఇది ఏంటమ్మా అని మహీంద్రా అంటాడు, అంకుల్ నేను రిషితో మాట్లాడడానికి వచ్చాను అని సాక్షి అంటే, మా డాడ్ వినకూడని సీక్రెట్స్ ఏం లేవు అని రిషి అంటాడు. ఇంతలో వసుధార కూడా అక్కడికి వస్తుంది.

Guppedantha Manasu 5 July Today Episode :తన మాటలతో సాక్షి కి చుక్కలు చూపించిన వసుధార

వసుధార నేను మళ్ళీ వస్తాను అనగానే, నేను ముందు వచ్చాను అని సాక్షి అంటోంది, ముందు ఎవ్వరూ వెనక ఎవరు అని కాదు ఎవరికి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అని రిషి అంటాడు. ఇంతకు ఈ పేపర్ లొ ఏముంది అని రిషి అంటాడు. మీ ఇద్దరి ఫోటో పేపర్ లో వచ్చింది అని సాక్షి అంటుంది. దాంట్లో ఏముంది వసుధార విజయానికి సన్మానం జరిగింది అదే పేపర్లో వచ్చింది. దీంట్లో ఏముంది అని రిషి, మహేంద్ర సాక్షితో అంటారు. ఇలా పేపర్లో ఫోటో వస్తే అందరూ ఏమనుకుంటారు రిషి అని సాక్షి అంటుంది. వసుధార ప్లేస్లో ఎవరు ఉన్నా నేను ఇలానే చేసేవాణ్ణి అని రిషి, సాక్షితో అంటాడు. తర్వాత వసుధార బయటికి వెళ్లి, రిషి సార్ మీతో మాట్లాడాలి కొంచెం టైం ఇవ్వండి అని ఓ మెసేజ్ చేస్తుంది. సాక్షికి నచ్చజెప్పి మహేంద్ర, సాక్షిని బయటికి తీసుకెళ్తాడు. తర్వాత సాక్షి చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని వస్తారా లాక్కుంటుంది ఏంటి లాక్కున్నావు అని సాక్షి అంటే ఒక్కొక్కసారి లాక్కోవడం కూడా చాలా ఆనందం ఉంటుంది అని వసుధార అంటోంది.

ఆ న్యూస్ పేపర్లో రిషి వసుధార ఫోటోని చూస్తూ వసుధార ఏదో అనబోతుంటే సాక్షి ఆపేస్తుంది.వసుధార ఏమో కోపం వస్తుంది సాక్షి ఇలా పేపర్లో ఫొటో వేయడం నీ ఐడియా ఏమో వాళ్లే వేశారో తెలియదు కానీ ఇలా పేపర్ తెచ్చి కాలేజ్లో చూపించావు చూడు నీది చాలా మంచి మనసు సాక్షి అని వసుధార వెటకారంగా అంటుంది. నీకు పార్టీ ఇవ్వాలి అని సాక్షికి చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఈసారికి నువ్వు త్యాగం చెయ్యాలి అని ఆ చాక్లెట్ని తనే తింటుంది. వసుధార సాక్షికి 10 రూపాయలు ఇచ్చి పండగ చేస్కో అని అంటుంది. వసుధార అలా కొద్దిసేపు మంచి మంచి పంచులతో సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యేలా మాట్లాడుతుంది వసుధార నువ్వు మొదలుపెట్టిన ఆటలో నేను గెలుస్తాను అని సాక్షి కి మంచి కౌంటర్ ఇచ్చి క్లాస్ కి టైం అవుతుంది అని వస్తారా వెళ్లిపోతుంది.

ఆ తర్వాత రిషి సార్ నా మెసేజ్కు రిప్లై ఇవ్వలేదు ఏంటి అని మాట్లాడుకుంటూ వెళుతోంది ఇంతలో రిషి ఎదురుగా వచ్చి ఏంటి నీకు నువ్వే మాట్లాడుకుంటున్నామో అని అంటాడు. మీ గురించే సార్ మీరు ఈ మెసేజ్కు రిప్లై ఇవ్వలేదని అనుకుంటున్నాను అని వసుధార అంటోంది. నాకు ఇంకా వేరే పని ఏం లేదనుకున్నావా నువ్వు ఎప్పుడూ మెసేజ్ చేస్తావొ అప్పుడు రిప్లై ఇద్దామని అనుకుంటూ ఉంటానా అంటాడు. వీళ్లు మాట్లాడుకోవడం జగతి మహీంద్ర కూడా చూస్తూ ఉంటారు. రిప్లై ఇస్తాను వెయిట్ చెయ్యి అని రిషి వసుధార తొ అంటాడు ఇక్కడే ఉండమంటారు అని వసుధార రిషితో అంటుంది. ఎక్కడ వెయిట్ చేసినా నీ మొబైల్ కీ మెసేజ్ వస్తుంది అని అంటాడు రిషి. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.