Intinti Gruhalakshmi 5 July Today Episode : కంగారు పడుతున్న లాస్య ను చూసి ఏమైంది లాస్య అని నందు అడగగానే, లాస్య తను తులసి విషయంలో చేసిన మోసాన్ని చెప్పి, ఇప్పుడు తులసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నందుతో చెబుతుంది. అది విన్న నందు లాస్య చెంప పగలగొడతాడు ఇదంతా లాస్య ఊహించుకొని కంగారు పడుతుంది. తర్వాత లాస్య నందూతో నాకు ఒక హెల్ప్ చేయి నందు నన్ను ఒంటరిగా వదిలి నువ్వు వెళ్లి ఎంజాయ్ చేసి రా అని అంటుంది. దాంతో నందు వెళ్లిపోతాడు. తర్వాత బాగ్య లాస్యతో బావగారికి జరిగింది చెబితే బాగుండు అనగానే లాస్య అప్పుడు నిజం చెబితే నా చెంప పగిలేది అని అంటుంది. ఇరవై లక్షలు ఎలా మరి అని భాగ్య అనగానే అప్పుడు లాస్య అప్పు అడుగుతాను ఎవరినైనా అని అంటుంది.
ఎవరిని అడుగుతావు అని భాగ్య అనగానే నువ్వే ఇవ్వు వడ్డీతో సహా ఇస్తాను అని లాస్య అంటుంది. దాంతో భాగ్య నా దగ్గర లేవు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత దివ్య, తులసి, అంకిత సరదాగా చెస్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఒకవైపు లాస్య కంగారుగా తెలిసినవాళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటుంది తర్వాత తులసి లాస్య కి కాల్ చేసి నీకు ఇచ్చిన గడువు గుర్తుఉందా అని అడుగుతుంది. దానితో లాస్య నాకు గుర్తుంది పదేపదే గుర్తు చేయొద్దు అని చెప్పి కట్ చేస్తుంది. లాస్య ఇంటికి వచ్చి ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది. తర్వాత తులసి దివ్యతో నా ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది చూడు అనగానే దివ్య మామ్ ఇరవై లక్షలు వచ్చాయి అని చెబుతుంది. తర్వాత తులసి లాస్యకు కాల్ చెయ్యగానే లాస్య నేను డబ్బు కట్టలేను చేతులెత్తేసాను, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెబుతుంది.
Intinti Gruhalakshmi 5 July Today Episode : లాస్య చేసిన మోసం తెలుసుకున్న నందు తనను క్షమిస్తాడా.

అప్పుడు తులసి లాస్యతో నువ్వు ఇంకా టెన్షన్ నుంచి బయటికి రాలేదా పిచ్చెక్కిందా నువ్వు వేసిన ఇరవై లక్షలు నా ఎకౌంట్లోకి పడ్డాయి అని చెప్పడానికి నీకు ఫోన్ చేశాను అని చెప్పి, ఫోన్ పెట్టేస్తుంది. దాంతో లాస్య షాక్ అవుతూ ఆలోచిస్తుంది అప్పుడు నందు అక్కడికి వచ్చి లాస్యతో డబ్బులు వేసింది నేను నువ్వు కాదు అని అంటాడు. నువ్వెందుకు వేశావు నందు అని లాస్య అనగానే నందు నువ్వు చేసిన తప్పును దిద్దడానికి, నా పరువు కాపాడుకోవడానికి, నేను స్వార్థపరున్ని కావొచ్చు కానీ ఇంతవరకు ఎవరినీ మోసం చెయ్యలేదు. డబ్బుకోసం ఎవరికీ అబద్ధాలు చెప్పలేదు, పరువుగా బ్రతికాను పరువు కోసం పాకులాడను కానీ నువ్వు ఒక తప్పుతో నా ఆత్మాభిమానాన్ని చంపేశావు, తులసి దృష్టిలో నన్ను మోసగాన్ని చేశావ్, రోడ్డుమీదికి లాగవు అని కోపంగా మాట్లాడుతూ, నువ్వు చీటర్ వి, నీకు సిగ్గుందా నువ్వు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానని, మీలాంటి దానికోసం నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను ఈ రోజుతో మన బంధం తెగిపోయింది.
నీ బ్రతుకు నీది నా బ్రతుకు నాది నా వెంట పడొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు. తరువాత తులసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో లాస్య తులసికి ఫోన్ చేస్తుంది, నందుకి నిజం చెప్పి నా కాపురాన్ని కూలిచావు అని నిలదీస్తుంది, లాస్య అప్పుడు తులసి నేను చెప్పలేదు నాకు ఆ అవసరం కూడా లేదు, ముందే నువ్వు సహాయం అడిగితే నేనే డబ్బులిచ్చే దాన్ని కానీ నువ్వే నన్ను మోసం చేశావు అని కోపంగా తులసి లాస్యతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత లాస్యకి సంజన కాల్ చేసి నువ్వు ఎందుకు డబ్బు విషయంలో అబద్దం చెప్పావు అని అడుగుతుంది, దాంతో లాస్య క్షమాపణ చెబుతుంది. తర్వాత నందు ని ఆపడానికి లాస్య విషం తాగి చస్తానని డ్రామా ప్లే చేస్తుంది, బాగ్య తో ఇదంతా నేను నందు కోసమే చేశానని డ్రామా క్రియేట్ చేస్తుంది దాంతో లాస్యను నమ్మి అప్పుడు నందు లాస్యను విషం తాగకుండా చేస్తాడు, క్షమాపణ కూడా చెబుతాడు. నాకోసం చావడానికి కూడా సిద్ధపడతావా అని లాస్యను దగ్గరికి తీసుకుంటాడు నందు ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.