Karthika Deepam 7 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1451 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ మౌనితను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు. కార్తీక్ ఇప్పుడు ఎలా ఉంది అని మౌనితాని అడుగుతాడు. అప్పుడు హాయ్ ఇప్పుడు కొంచెం పర్లేదు.. నువ్వేమన్నా తిన్నావా కార్తీక్ అని అడుగుతుంది. అప్పుడు మౌనిత ఆ ఇంటి ఎదురుగా ఆవి ఉందా పోయిందా అంటుంది. అప్పుడు కార్తీక్ ఎందుకు ఆమెతో మళ్ళీ ఇడ్లీ తెప్పించుకుంటావా.. అని అంటాడు. అప్పుడు దీపని లేదు.. నన్నెంత పనిచేసింది కదా ఉందా వెళ్లిపోయిందా అని అడుగుతున్నాను అని అంటుంది. అప్పుడు శివ తాళం వేసిందమ్మా అని అంటాడు. కార్తీక్ నేను ఇచ్చిన డోస్ కి వెళ్ళిపోవడమే కాదు ఇంకా కనపడదు అనేసి అంటాడు. అప్పుడు మౌనిత సంతోషంతో నువ్వు డోస్ ఇచ్చావా ఏమన్నావు అని అడుగుతుంది. కార్తీక్ గట్టిగా చెడమడ తిట్టేశాను అని అంటాడు. సరే నువ్వు రెస్ట్ తీసుకో మేం బయటికి వెళ్లి టిఫిన్ తీసుకొస్తాం కానీ వెళ్ళిపోతారు.
Karthika Deepam 7 September Today Episode : దీపకు దగ్గరవుతున్న కార్తీక్…
అప్పుడు మౌనిత సంతోషంతో గెంతులు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే హిమ సౌర్య ఫోటో చూస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో ఆనందరావు, సౌందర్య వస్తారు. వాళ్లని సౌర్య దగ్గరికి వెళ్దాం.. మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం తర్వాత అనాధ శరణాలయం కి వెళ్దామని అంటుంది. అప్పుడు సౌందర్య దాని దగ్గరికి వెళ్తే అది ఇంకా కోప్పడుతుంది. అది రాదే అని అనాధ శరణాలకి వెళ్దాం పదండి అని అక్కడికి వెళ్తారు. కట్ చేస్తే గుడిలో దీప అక్కడికి వచ్చి శౌర్య హేమల పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటుంది. దేవుని నా భర్తని నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చు మేము ఎప్పుడు సంతోషంగా ఉండేలా చెయ్ దేవుడా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే హిమ సౌర్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిక్షణం దాని గురించి ఆలోచిస్తావు. కానీ బాధ అర్థం చేసుకోదు అది ఏనాటికో ఒక నాటికి నీ బాధ అర్థం చేసుకుంటుంది అప్పటివరకు నువ్వు దాని గురించి ఆలోచించకు హ్యాపీగా ఉండు అని అంటుంది సౌందర్య. కట్ చేస్తే సౌర్య వారణాసి గుడికి వస్తారు.

అదే గుడిలో దీప ఒకపక్క దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకొకపక్క సౌర్య మా అమ్మానాన్నలు కనిపించాలి దేవుడా అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. అంతలో కార్తీక్, మౌనిత వస్తారు. అప్పుడు కార్తీక్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావా ఏమైనా స్పెషలా అని మౌనిత అని అడుగుతాడు. అప్పుడు మౌనిత మీరు వంట లక్కతో మాట్లాడను, కలవను అని ప్రమాణం చేయాలి అంటుంది. అప్పుడు ఏ కాలంలో ఉన్న మౌనిత ఇప్పుడు ప్రమాణాలు ఏంటి ఒకవేళ ప్రమాణం చేసినాక మాట్లాడితే ఏం చేస్తావ్ అంటే నాకు గుర్తుండదు కదా అని అంటాడు. అప్పుడు మౌనితా దేవుడి మీద ప్రమాణం చేస్తే మర్చిపోరు అనిత అని గుళ్లోకి తీసుకెళ్తుంది. ఒకటే గుళ్లో మౌనిత, కార్తీక్, దీప, శౌర్య, వారణాసి ఉంటారు కానీ ఒకళ్ళు చూసుకోరు. అంతలో దీప కార్తీక్ మోనితాన్ని చూస్తుంది. అప్పుడు మౌనిత కార్తీక్ ని అయ్యగారు ఏంటమ్మా అర్చన చేయించాలా అని అంటాడు. అప్పుడు మౌనిత ప్రమాణం చేయాలి హారతిని తీసుకురండి అంటారు. అప్పుడు తీసుకురాగానే మౌనిత వంట లక్కతో మాట్లాడను ఇక కలవను అని ప్రమాణం చేయి అని చెప్పగానే చేస్తూ ఉండగా..
అంతలో దీప ఆగండి డాక్టర్ బాబు అని దగ్గరికి వస్తుంది. మీరు నాతో మాట్లాడినంత తప్పు నేనేం చేశాను అంటుంది దీప. అప్పుడు మౌనితా తప్పు చేయలేదా నేను తినే టిఫిన్ లో విషయం ఎందుకు కలిపావు. అప్పుడు గుడిలో నిలబడి చెబుతున్నాను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను నేను చెయ్యలేదు అని దానిని చేయమని చెప్పండి. అంటూ దీప నేను మౌనితా ఇచ్చిన టిఫిన్ లో ఏ మందు కలపలేదు అని హారతి పై ప్రమాణం చేస్తుంది. అప్పుడు కార్తీక్ ప్రమాణం చేసింది కథ కలపలేదని నిజమే అయ్యి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మౌనితా నేను నమ్మను ఇది పెద్ద మాయలాడి అని అంటుంది. సరే నేను కలపలేదని చేశాను కదా నువ్వు కలిపావని చేయి అని మౌనిత అని అంటుంది దీప. అప్పుడు మౌనిత కంగారుపడుతూ నేనెందుకు చేయాలి అని చేయను అని అంటుంది. దీప, డాక్టర్ బాబు చేయమని చెప్పండి అని అంటుంది దీప. అంతలో మౌనిత శౌర్యని చూసి ఆమ్మో వీళ్ళు నా చుట్టూ ఉన్నారు కదా అని భయపడిపోతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత ని కార్తీక్ తిడుతూ ఉంటాడు. కార్తీక్ మౌనితాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో దీప కార్తీక్ కి తల మసాజ్ చేస్తూ ఉంటుంది అది చూసి మౌనిత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లు చూడాలి.