Guppedantha Manasu 8 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 08-September-2022 ఎపిసోడ్ 550 ముందుగా మీ కోసం. దేవయాని వసుధార, రిషి మద్య గొడవ పెట్టడానికి కుట్ర పన్నుతోంది, జగతి, మహేంద్రల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చెయ్యడానికి, రిషిని ఒప్పించమని వసుధారతొ చెబుతుంది.ప్రయత్నిస్తాను మేడం అని వసుధార అంటుంది. ఇంతలో రిషి కూడా క్యాంటీన్ కి వస్తాడు. మీరేంటి పెద్దమ్మ ఇక్కడ ఉన్నారు అని అంటాడు. కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వసుధార కి లొకేషన్ షేర్ చేసి, రిషి రమ్మన్నాడు అని చెబుతాడు గౌతమ్, అదే విధంగా రిషి విషయంలో కూడా చేస్తాడు గౌతమ్, వీళ్లిద్దర్నీ ఒక ప్లేస్ కి వచ్చేలా చేస్తాడు.కొద్ది సేపు రిషి, వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు.
Guppedantha Manasu 8 September 2022 Episode : రిషి తన మనసు మార్చుకొని జగతి, మహేంద్రల యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తాడా?
ఇలా సంతోషంగా ఉన్న సమయంలో వసుధారకి, దేవయాని చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, అడుగుతూ ఉంటుంది వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి రిషిని.రిషికి కోపం వచ్చి, నువ్వు ఇంకొకసారి ఇటువంటి ప్రస్తావన తేవొద్దు అని అంటాడు. తన రూమ్ దగ్గర దించుతాడు వసుధార ని,వసుధార సారీ సార్, ఇంకొకసారి ఈ టాపిక్ నేనెప్పుడూ తీసుకుని రాను అని అంటుంది. ఓకే వసుధార నేను కూడా కోప్పడకుండా ఉండాల్సింది, అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు.ఒకవైపు మహేంద్ర, జగతి ఇద్దరూ రిషి వసుధారా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉండగా, ఆ మాటల్ని విన్న రిషి, నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఎలాగైనా యానివర్సరీ సెలబ్రేషన్స్ చెయ్యాలి అని అనుకుంటాడు మనసులో.

గౌతమ్ వచ్చి ఏంట్రా వసుధార ఫోన్ చేసిందా అని అనగానే, కోపంగా సమాధానం చెప్పేసరికి, రిషి ప్రవర్తన చూసి, వసుధార అడిగే ఉంటుంది. వీళ్ల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది అని సంతోషపడుతుంది. రిషి యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్న విషయం గురించి, వసుధారకి చెప్పాలి అని, వెంటనే వసుధార కి మెసేజ్ చేస్తాడు, తెల్లవారగానే వసుధార కూడా వస్తుంది.అప్పుడు రిషి, జగతి మహేంద్ర దగ్గరికి వెళ్లి, ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి, సెలబ్రేట్ చేయాలి అని అంటాడు. దాంతో రిషి మాటలకు జగతి మహేంద్ర సంతోషపడతారు.దేవయాని రిషి మాటలకి షాక్ అవుతుంది.ఏంటి ఈ వసుధార ఇంత పని చేసిందా, రిషి ని ఒప్పించిందా, అని షాక్ అవుతూ, మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. వసుధార, రిషిని జగతికి దగ్గర చేసే లాగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది.రానున్న ఎపిసోడ్ లొ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.