Low BP : ప్రస్తుత కాలంలో హై బీపీ తోనే కాకుండా లోబీపీతో కూడా చాలామంది బాధపడుతున్నారు. కొందరికి బీపీ ఎక్కువగా ఉంటే ఇంకొందరికి చాలా తక్కువగా ఉంటుంది. మనం ఆరోగ్య సరిగా లేదని డాక్టర్ వద్దకు వెళ్తే ముందుగా రక్త పోటు చెక్ చేస్తారు. అయితే డాక్టర్ మన శరీరంలో అవయవాలకి రక్త సరఫరా ఎలా జరుగుతుందో లేదో అనేది తెలుసుకుంటారు. శరీరానికి రక్త సరఫరా చేసే ధమనులు ఆరోగ్యంగా లేకపోతే రక్త సరఫరా పై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీనినే బ్లడ్ ప్రెజర్ అంటుంటాం. అయితే శరీరంలో రక్తం సరిపడా లేదని అర్థం. నార్మల్ బిపి అంటే వ్యక్తుల సిస్టోలిక్ ప్రెజర్ 90 mm Hgకంటే ఎక్కువ , 120 mm Hg కంటే తక్కువ ఉండాలి. డయాస్టోలిక్ ప్రెజర్ 6omm Hg కంటే ఎక్కువ , 80 mm Hgకంటే తక్కువ ఉండాలి.
పెద్దవారికి నార్మల్ బిపి 120/80 mmHg కంటే తక్కువగా ఉండాలి. డయాస్టోలిక్ ప్రెజర్ 95 mm Hg కంటే సిస్టోలిక్ 140 mm Hg మించరాదు. అయితే పురుషుల్లో 70/110, మహిళల్లో 60 /100 కంటే తక్కువగా ఉంటే లో బిపి ఉన్నట్లు.అయితే ఈ లక్షణాలు కనిపించినట్లయితే లోబీపీ గా గుర్తించవచ్చు. కళ్ళు మసకలగా కనిపిస్తాయి. నిలుచున్న ,కూర్చున్న కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. శ్వాస వేగంగా నీరసంగా మారిపోతుంది. అలసటిగా అనిపిస్తుంది. ఎక్కువసేపు పని చేయలేకపోవడం. తలనొప్పి, కడుపులో వికారంగా అనిపిస్తుంది. కొన్ని రకాల మందులు సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ రక్తస్రావం కూడా లోబీపీకి కారణమవుతుంది. శరీరమంతా చల్లగా అవుతుంది. అయితే లోబీపీతో ఎటువంటి ప్రమాదాలు చుట్టుముట్టుతాయో తెలుసుకుందాం.
Low BP : అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

బ్రెయిన్ లో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. గుండెపోటు మూత్రపిండాలు కూడా చెడిపోతాయి దీనితో పాటు స్టోకు కూడా రావచ్చు. అయితే దీనిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. లోబీపీని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. లోబీపీని కంట్రోల్ చేసుకోవడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పులు, చెడు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆకలితో ఉండకుండా కడుపునిండా ఆహారం తీసుకోవాలి. లో బిపి అనిపించగానే నిమ్మరసం తాగాలి. ప్రతిరోజు ద్రవాలు తీసుకోవాలి. మద్యానికి దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.
ఎప్పటికప్పుడు బిపిని చెక్ చేస్తూ ఉండాలి. ఒక గ్లాస్ మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం వేసుకొని కలుపుకొని తాగి లోబీపీని నార్మల్ గా చేసుకోవచ్చు. చాక్లెట్స్ తినడం కూడా మంచిదే. మనం తినే ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పుని వేసుకొని తినాలి. తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. త్వరగా జీర్ణం అయ్యే కార్బోహైడ్రేట్లు తినడం మానాలి. లోబీపీని చాలామంది తేలిగ్గా తీసేస్తూ ఉంటారు కానీ ఇది ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు.