Rathika Rose : రతిక ఎలిమినేషన్ కన్ఫర్మ్… ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్…

Rathika Rose  : బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ముందే బయటకు వచ్చింది. ఇక బిగ్ బాస్ లో ఈసారి రతిక రోజ్ హౌస్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రతిక అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి ఒక పోస్ట్ రావడంతో అధికాస్త వైరల్ గా మారింది. దానిలో ఏముందంటే…రతిక ఈ వారం ఎలిమినేట్ కానుంది అంటూ మాకు సమాచారం వచ్చింది. కానీ తాను బిగ్ బాస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్స్.

Advertisement

rathikas-elimination-confirmed-post-viral-on-instagram

Advertisement

రతిక టాప్ 3 లో ఉండేందుకు అర్హత గల కంటెస్టెంట్. అమర్దీప్ వంటి నెగిటివ్ వ్యక్తుల వలన తను తప్పుడు దారిలో నడుస్తుందని …తనకి మరొక ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అంటూ రాస్కొచ్చారు. అలాగే ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపించండని, తన వెనక ఏం జరుగుతుందో తాను తెలుసుకోవాలని…ఎవరు తన మంచి కోరుకుంటున్నారు..?ఎవరు ఆమెను వాడుకుంటున్నారు…? తనకు తెలియాలి. రతిక చాలా మంచి అమ్మాయి అమర్దీప్ తనని వాడుకుంటున్నారు అని రతీక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మధ్యలో అమరదీప్ ఎందుకు వచ్చాడంటూ నేటి జనులు సెటైర్లు వేస్తున్నారు.

rathikas-elimination-confirmed-post-viral-on-instagram

ఇది ఇలా ఉంటే ఎలిమినేషన్ కు ఒక రోజు ముందే రతిక ఎలిమినేట్ అయిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారేంటి..? అని నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అలాగే రతిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తున్న వారికి , ఇలా చేయడం బిగ్ బాస్ రూల్స్ కు విరుద్ధమని తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేక సింపతితో ఓట్స్ పడతాయని ఇలా చేసి ఉంటారా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగా ఇంతలోనే దానికి సంబంధించిన పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. అయినప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈరోజు జరగబోయే ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు వేచి చూడాలి.

Advertisement