Karthikadeepam : కార్తీకదీపం తెలుగు నిర్మాతల కక్కుర్తి యవ్వారం గురించి ఆ మలయాళ ఒరిజినల్ కు అసలు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. ఇష్టరాజ్యంగా కథను మార్చేస్తూ కొత్త క్యారెక్టర్ లను తెస్తూ కొన్ని తొలగిస్తూ… ఏది తెస్తే అది తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. ఏ ప్రాంతీయ భాషల్లోనూ ఈటీవీ సీరియల్ కి లేనంతగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. పెద్దపెద్ద స్టార్లు సినిమాలు కూడా ఈ సీరియల్ రేటింగులతో పోటీ పడలేకపోయాయని కోట్లకు కోట్లు డబ్బు మేంటింగ్ … అయినా సర్దార్ నిర్మాత తనవి తీరలేదు. అతని కాంక్ష తీరలేదు… ఒక జనరేషన్ పాటు నడిపించాలని అనుకున్నాడు ఏమో సీరియల్ ను.. ఫస్ట్ జనరేషన్ ను చంపిపారేసినట్టు ఓ కథ వడ్డించాడు.
Karthikadeepam : కథలోని ట్విస్ట్ ముందే ఊహిస్తున్నారా…
వంటలక్క, డాక్టర్ బాబు, మౌనిత ఇలా అందర్నీ చంపి పారేద్దాం అనుకుంటే, ప్రేక్షకులు నన్ను పారేస్తున్నారు అనుకున్నాడు… అయినా ఏముందిలే మన సీరియల్ అభిమానులే కదా.. మనం ఇష్టం వచ్చినట్టు కథకు ట్విస్టులు ఇయ్యవచ్చు. ఇక ఏమీ లాభం లేదు అనుకోని, చంపి ఫోటోలకి దండ వేసిన వంటలక్కన బ్రతికించేశాడు. ఆస్పత్రిలో కోమాలో ఉన్న ఆమె హఠాత్తుగా లేచి మళ్లీ తెలుగు ప్రేక్షకులను అర్జెంటుగా ఉద్ధరించడానికి రీఎంట్రీ ఇచ్చింది. ఇక వంటలకు వచ్చాక కార్తీక్ బాబు ఊరుకుంటాడా అతను కూడా బతికాడు.. ఇక మౌనిత పాత్రకు మాత్రం అన్యాయం ఎందుకు..

ఆమె కూడా తెరమీదకి వచ్చేసింది. ముగ్గురు కలిసి ఉద్ధరించేసి రేటింగ్స్ పెంచేసి. మరికొన్ని కోట్లు ప్రింట్ చేసి నిర్మాతకు ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకుంటున్నారని.. ఇదిగో ఈ బార్క్ రేటింగ్ చూడండి… హైదరాబాద్ కేటగిరి… సరే, ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేస్ లో అదే.. పైగా ఒక శుక్రవారం రోజున మరీ 10 లోపాలకు వెళ్లిపోయింది. ఎప్పుడు ఎన్నింటికి గుప్పెడంత మనసు దబిదబి మని దెబ్బలు తీసేస్తుంది.కారణం ఏమిటంటే సింపుల్.. అసలు టీవీ సీరియల్ కథలే లక్ష శాతం కృతకం…. ఇది మరీ ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేసి వీర కృతకం.