Tees maar Khan : లవర్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకు పోతున్న హీరో ఆది సాయి కుమార్. డైలాగ్ కింగ్ అయినటువంటి సాయి కుమార్ కొడుకు ఆది. ప్రేమ కావాలి చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ లో తన కెరియర్ ను స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే మంచి లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ఈ సినిమాలో ఇషా చావ్లా తో రొమాన్స్ చేసి ఈ సినిమాతో పెద్ద హీట్ ను అందుకున్నాడు.
తర్వత లవ్ లీ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు తో శభాష్ అనిపించకున్నారు. ఈ సినిమాలో శాన్వీ తనకు జంటగా నటించి అలరించింది.
అది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేకకులకు దగ్గర అయ్యారు. సుకుమారుడు అనే సినిమాతో మళ్లీ 2013 లో బి అశోక్ దర్శకత్వం చేశారు. ఈ సినిమాలో నిషా అగర్వాల్ తనకు జంటగా నటించింది. ఇప్పుడు అది వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం బ్లాక్, టాప్ గేర్, క్రేజీ ఫెలో, తిస్ మర్ ఖాన్ అనే సినిమాలు చేస్తూ చాల బిజీ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు విజన్ సినిమాస్ బ్యానర్ పై వస్తున్న తీస్ మార్ ఖాన్ మూవీ కి సంభందించిన మూవీ టీసర్ రిలీజ్ అయ్యింది.
Tees maar Khan : ఆసక్తి కరాంగా ఉన్న టీజర్.

లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ కి నాటకం ఫేమ్ జి గోగణ డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ మూవీ లో ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేయనుంది. ఈ మూవీలో సునీల్, పూర్ణ, ఖాబీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి అంటూ డైలాగ్ తో వచ్చే ఈ టీజర్ హైలైట్ గా నిలిచింది. తీస్ మార్ ఖాన్ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని మనం అందరం కోరుకుందాం..