Viral Video : సొంత తండ్రినే రోడ్డు మీదికి ఈడ్చుకెళ్లి చితకబాదిన కొడుకు… ఎక్కడో తెలుసా?

Viral Video : తల్లిదండ్రులు లేకుండా మన జీవితమే లేదు. ఈ భూమ్మీద జన్మించామంటే దానికి కారణం వాళ్లే. దేవుడిని మొక్కినా మొక్కకున్నా ఎవరూ ఏమనరు కానీ.. తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతే ఈ సమాజం మనల్ని క్షమించదు. అందుకే తల్లిదండ్రులే మొదటి దైవం అంటారు పెద్దలు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా వాళ్ల పిల్లలదే. కానీ.. ఈరోజుల్లో తల్లిదండ్రులకు వయసు అయిపోయాక చాలామంది వాళ్లను చిన్నచూపు చూస్తున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. గాలికి వదిలేస్తున్నారు.

Advertisement
son beats father on street in rajasthan video viral
son beats father on street in rajasthan video viral

అంతే కాదు.. కొందరైతే తీవ్రంగా కొడతారు కూడా. తల్లి, తండ్రి అని చూడకుండా తల్లిదండ్రులపై విరుచుకుపడిన ఎన్నో ఘటనలకు సంబంధించిన వీడియోలను మనం చూశాం. తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో చోటు చేసుకుంది.

Advertisement

Viral Video : సొంత తండ్రి అని కూడా చూడకుండా చితక్కొట్టిన కొడుకు

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడానికి కారణం.. సొంత కొడుకే సొంత తండ్రిని చితకబాదడం. రోడ్డు మీదికి తండ్రిని లాగి సొంత కొడుకు అతడిపై విరుచుకుపడ్డాడు. ఇంట్లో ఏదో గొడవ వల్ల తండ్రితో గొడవ పెట్టుకున్న కొడుకు ఆ తర్వాత తన దగ్గర ఉన్న కర్రతో కొట్టాడు. ఆ తర్వాత బయటికి లాగి మళ్లీ కొట్టాడు. పక్కనే ఉన్న డబ్బాతో కొట్టబోయాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అనిపించడంతో కొట్టడం ఆపేశాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అయితే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయం పోలీసులకు తెలిసి.. సీపీసీ 151 సెక్షన్ ప్రకారం అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. అలా ఎలా సొంత తండ్రిపై క్రూరంగా ప్రవర్తిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement