Bigg Boss 6 Telugu : ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టబోతున్న పెళ్లి మూవీ హీరో వడ్డే నవీన్

Bigg Boss 6 Telugu : బుల్లితెర పైకి ఎన్ని సీరియల్స్ , ప్రోగ్రామ్స్, సినిమాలు వస్తున్న “బిగ్ బాస్” షోకి ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బిగ్ బాస్ షో ఐదు సీజన్లు పూర్తి చేసుకొని అందరి అభిమానుల మనసులను నిలిచిపోయింది, బిగ్ బాస్ షోకి మంచి గుర్తింపు లభించింది.బిగ్ బాస్ షో ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న తర్వాత,ott అని సరికొత్త కసరత్తులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ ఓటీటీ ప్రోగ్రామ్ అంతగా ప్రేక్షకుల మనసులను ఆకట్టుకోలేదు.దాంతో బిగ్ బాస్ యాజమాన్యం మళ్లీ ప్రేక్షకుల మనసులకి దగ్గరగా ఉండటం కోసం సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం చెయ్యడానికి అన్ని పనులు జరుగుతున్నాయి.

బిగ్ బాస్ షో సీజన్ సీజన్లో కొత్త కొత్త కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి మన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దాంట్లో జరిగే టాస్కులతో ఎంతో అలరిస్తున్నారు.అయితే అలాంటి బిగ్ బాస్ షో కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్క ప్రేక్షకులు ముందుగానే ఆలోచించేది కంటెస్టెంట్స్ గురించి.కొత్త కంటెస్టెంట్ ఎవరు వస్తారో అని ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు వచ్చిన కంటెస్టెంట్స్లో చాలామంది చాలామందికి ఫ్యాన్స్ గా ఉంటారు. అలాంటి సీజన్ 6 లో వచ్చే కంటెస్టెంట్స్ గురించి నట్టేట్లో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి.దాంట్లో ఈమధ్య తాజాగా వినిపించిన పేరు హీరో వడ్డే నవీన్ ఒకప్పటి పెళ్లి మూవీతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న వడ్డే నవీన్ గారు.

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టబోతున్న హీరో వడ్డే నవీన్

hero Vadde Naveen entery Bigg Boss season6
hero Vadde Naveen entery Bigg Boss season6

హీరో వడ్డే నవీన్ గారు ఇండస్ట్రీకి చాలా రోజులుగా దూరంగా ఉన్నారు. వడ్డే నవీన్ గారు ఇప్పటివరకు ఎలాంటి ఈవెంట్స్ కి రాలేదు. కానీ ఒక సంవత్సరం క్రితం ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వడ్డే నవీన్ గారు తొలి సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నారు తన నటనతో మంచి మార్కులను సొంతం చేసుకున్నారు వడ్డే రమేష్ గారి వారసుడిగా వడ్డే నవీన్ కి మంచి పేరు దొరికింది. వడ్డే నవీన్ గారి కెరియర్లో తను తీసిన అన్ని సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మూవీ “పెళ్లి”. దీంట్లో ఎంతో మంచి పాత్ర చేసి తనకంటూ సొంత గుర్తింపు సొంతం చేసుకున్నారు.అలా వడ్డే నవీన్ గారు చాలా సినిమాలు చేశారు కానీ అంతగా హిట్ కాలేదు.

కొద్ది రోజుల తర్వాత మళ్లీ 2010 లో శ్రీమతి కల్యాణం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.తర్వాత తనకి మంచి అవకాశాలు రాలేదు, కానీ వడ్డే నవీన్ గారు దాదాపు తెలుగులో 30 సినిమాల దాకా చేశారు కొద్దిరోజుల క్రితం వడ్డే నవీన్ తన కొడుకు ఫంక్షన్లో దిగిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో కనిపించింది.వడ్డే నవీన్ గారి ప్రేక్షకులు, అభిమానులు అంతా తన రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి నవీన్ గారికి బిగ్ బాస్ షో సీజన్ సిక్స్ కి ఆహ్వానం వచ్చింది కానీ, దానికి నవీన్ గారు ఒప్పుకోలేదు.దాంతో ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసి మరీ ఒప్పించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వార్త నిజం అయ్యి వడ్డే నవీన్ గారు బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రేక్షకుల ముందుకు రావాలని తన అభిమానులు , ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.