Krithi Shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో హీరోయిన్ కృతి శెట్టి తెలుగు పరిశ్రమకి పరిచయం అయింది. ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవి తేజ్ కు జోడిగా నటించి మంచి హిట్ ను దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత నాని ‘ శ్యామ్ సింగరాయ్ ‘ సినిమాలో నటించి మరో హిట్ ను కొట్టింది. ఆ తర్వాత నాగచైతన్యతో ‘ బంగార్రాజు ‘ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. యంగ్ బ్యూటీ కృతి శెట్టి వాళ్ళ నాన్నగారు వార్నింగ్ ఇచ్చినట్లు కన్నడ మీడియా చెబుతుంది. అంతేకాదు తెలుగులోనే అమ్మడు గురించి ఓ న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అసలు కృతి శెట్టి వాళ్ళ నాన్న కృతికి ఎందుకు వార్నింగ్ ఇచ్చారో తెలుసుకుందాం.
మొదటి సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ రెండో సినిమాకి డబల్ రెమ్యూనరేషన్ తీసుకొని దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చింది. అయిన అమ్మడికి క్రేజ్ బాగా ఉండడంతో ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. అయితే ఈ బ్యూటీ కి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రామ్ తో తీసిన ‘ ది వారియర్ ‘ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే నితిన్ తో ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిపోయింది. దీంతో అమ్మడు రేంజ్ కూడా దిగిపోయింది. అయితే ఇప్పుడు అందరు కళ్ళు ఆమె నటిస్తున్న తర్వాతి సినిమా ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ‘ అనే సినిమా పైనే ఉన్నాయి.
Krithi Shetty : గట్టి వార్నింగ్ ఇచ్చిన ఫాదర్…

ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ కృతి నటన అన్ని సినిమాల లాగానే ఉంది. దీంతో ఈ సినిమాకి కృతి శెట్టి తన తర్వాత సినిమాలలో ఛాన్స్ రాకపోవచ్చు అని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె నటన చూసిన వాళ్ల ఫాదర్ కూడా నీలో రానురాను నటనపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇలాగైతే నీకు సినిమా పరిశ్రమలో అవకాశాలు రావు. నీ కెరీర్ పడిపోతుంది. జాగ్రత్త.. నువ్వు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలంటే కష్టపడాలి అంటూ ఆమెను గట్టిగా మందలించాడట. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.