Intinti Gruhalakshmi 7 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 7-September-2022 ఎపిసోడ్ 731 ముందుగా మీ కోసం. అభి, అంకిత వాళ్ల ఇంటికి వెళతాడు. అంకిత వాళ్ల అమ్మ, అంకిత ఎక్కడ అభి అని అడుగుతుంది. ఇంకెక్కడా అంటీ రాలేదు, వాళ్ల అత్తయ్య చుట్టే తిరుగుతూ ఉంటుంది అని అంటాడు.దాంతో అంకిత వాళ్ళ అమ్మ, నువ్వు ఏం చేస్తావో తెలియదు, అంకిత ఇక్కడికి రాకపోతే, నువ్వు కూడా రాకూడదు, లేదంటే అంకితకు విడాకులు ఇవ్వు, అలా ఆయన వస్తుంది అని, చేతనైతే అంకితను మార్చు అని అభి తో అంటుంది.ఒకవైపు లాస్య, నందూతో తను చేసిన కుట్ర గురించి చెబుతూ ఉంటుంది. పేపర్లో తులసి వేయించినట్టుగా బిజినెస్ డీల్ క్యాన్సిల్ అయిన నట్టు, తులసి ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా, లాస్య వేయిస్తోంది.న్యూస్ పేపర్ సామ్రాట్ చదివేలా, న్యూస్ పేపర్ని సామ్రాట్ ఛాంబర్ కి వెళ్లేలా చేస్తుంది. వాళ్లిద్దరి మధ్య గొడవ పెంచాలి అనేది లాస్య ఉద్దేశం.తులసి సంగీతం క్లాస్ చెప్పుకోవడానికి, స్కూల్ వాళ్లు పర్మిషన్ ఇస్తారేమో అడగడానికి వెళుతున్నాను అని, ఇంట్లో వాళ్లకి చెబుతుంది, దాంతో ఒక్కసారి సామ్రాట్తో మాట్లాడమని ఇంట్లో వాళ్లు అందరూ అంటారు, కానీ తులసి అదృష్టం వెనక పరిగెత్తడం ఎంత పెద్ద తప్పు అని తెలిసొచ్చింది మామయ్యా అంటూ ఇలా కొద్దిసేపు మాట్లాడుతుంది.
Intinti Gruhalakshmi 7 September Today Episode : తులసి మీద కోపంతో ఉన్న సామ్రాట్.
తులసి ఇంటి నుండి బయటకు వెళుతుండగా, ప్రెస్ వాళ్లు వస్తారు. ఈ బిజినెస్ డీల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అని, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తులసి అసలు ఈ వార్త బయటికి ఎలా వచ్చింది, ప్రెస్ వాళ్ళ వరకు ఎలా వెళ్లింది అని ఆలోచిస్తుంది తులసి.ఈ ప్రాజెక్ట్ సామ్రాట్ గారిది, సామ్రాట్గారూ సమాధానం చెబుతారు అని అనగానే, ఆ రోజు మొత్తం ఇన్చార్జి మీదే అని అన్నారు కదా, మీరు కూడా భాగస్వామి కదా అని అడుగుతూ ఉంటారు తులసిని.ఒకవైపు సామ్రాట్ తన ఛాంబర్లో న్యూస్ పేపర్ నీ చూస్తాడు. న్యూస్పేపర్లో లాస్య వేయించిన మ్యాటర్ ని చదువుతూ ఉంటాడు.ఇంతలో నందు, లాస్య వస్తాడు. ఇది చదివారా లాస్య, ఇందులో ఏముందో అంటే, చూశాను సార్ తులసి వేయించింది అని అంటుంది. ఇంతటితో అయిపోయింది, మళ్లీ పేపర్లకు ఎక్కడమెందుకో అని సామ్రాట్ అంటాడు.సార్ ఈ సమయంలో అనకూడదు కానీ, అనవసరంగా మీరు తులసికి అతి చనువు ఇచ్చారు అని అంటుంది.

సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకొచ్చాం అంటే, ఇప్పుడు తులసి మళ్లీ ప్రెస్వాళ్లను ఇంటికి పిలిచింది, మళ్లీ ఏ సమస్య తెస్తుందో, అది చెప్పడానికే వచ్చాను, మీరు వెళ్లండి సార్ అక్కడికి అని, సామ్రాట్ని రెచ్చగొడుతుంది లాస్య.ఒకవైపు తులసిని ప్రెస్ వాళ్లు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మీరు చెప్పకపోతే ప్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్టు రాస్తారు అని, సమాధానం చెప్పమని అడుగుతారు.ప్రేమ్ ప్రెస్వాళ్లను వెళ్ళిపొమ్మని చెబుతాడు.తులసి ఇంట్లో వాళ్ళతో ఈ విషయం బయటికి ఎలా వెళ్లింది అని అంటుంది. నువ్వు సమాధానం ప్రెస్ వాళ్లకి చెప్పవు, సామ్రాట్ గౌరికి చెప్పావు ఎలా అమ్మా అని తులసి వాళ్ళ మామయ్య అంటాడు. ఇంతలో సామ్రాట్ కోపంగా అక్కడికి వస్తాడు.తులసి మామయ్యతో మీరు ఇంటికి పెద్ద, ఇంట్లో వాళ్లు తప్పు చేస్తే సరిదిద్దాలి అని అంటాడు. తులసి దగ్గరికి వెళ్లి, కొండ పైన వాలిన పక్షి తను కొండ కంటే ఎత్తైనదానిని అని భ్రమపడటం పిచ్చితనం, వెర్రితనం ఇంకొకటి లేదు అని అంటాడు. అసలు ఏం చేద్దామని మీ ఉద్దేశం, పాలుపోసిన చేతుల్ని, కాటు వేద్దామని అనుకుంటున్నారా అని అంటాడు.మా అమ్మ చేసిన తప్పేంటి సార్ అని ప్రేమ్ అంటాడు.మీ అమ్మ తనంతట తానే బిజినెస్ నుంచి తప్పుకుంది అని ఉంటుండగా, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.