Viral Video : ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అందులో కొన్ని రకాల వీడియోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇందులో కొన్ని భయపెట్టివి గాను మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఇంకా కొన్ని నవ్వుకునేలా ఉంటాయి. ప్రస్తుతం మన చూడబోయే వీడియోలో నేషనల్ పార్క్ వద్ద సందర్శకుల దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తల్లి ఏనుగు రోడ్డు క్రాస్ చేస్తుండగా పిల్ల ఏనుగు సందర్శికులను అనుసరిస్తూ వారి దగ్గరికి వెళ్తుండగా మళ్లీ ఏనుగు ఆపుతున్న ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేయబడింది.
Viral Video : మనుషుల దగ్గరకు వెళ్లద్దు అని పిల్ల ఏనుగును అపుతున్న తల్లి ఏనుగు
మొదట తల్లి ఏనుగు నేషనల్ పార్క్ లోని రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో దాన్ని చూడడానికి వచ్చిన టూరిస్టులు ఈ వీడియోని తీయడం జరిగింది. ఈ వీడియోలో రోడ్డు దాటుతున్న ఏనుగు తన పిల్ల ఏనుగును కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఘటన అందరినీ ఆకర్షించింది. తల్లి ఏనుగు పిల్ల ఏనుగు రెండు కలిసి రోడ్డు దాటుతున్న టైంలో పిల్ల ఏనుగు అక్కడ టూరిస్టులను చూసి వారి వద్దకి రావడానికి ప్రయత్నిస్తుంది.

అది గమనించిన తల్లి ఏనుగు వారి వద్దకు వెళ్ళొద్దని తన తొండంతో దగ్గరికి తీసుకొని రోడ్డు క్రాస్ చేయడం జరిగింది. ఈ ఘటన చూసిన ప్రేక్షకులు మనుషుల దగ్గర నుండి తమకు హాని ఉందని అవి అనుకుంటున్నాయి అన్నట్లుగా అవి ప్రవర్తించాయి. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్లను తెలియజేస్తున్నారు. మనుషుల మీద జంతువులకు నమ్మకం సన్నగిల్లిందని చెప్పడానికి ఏదో ఉదాహరణగా చూపిస్తూ మనుషుల మీద జంతువులకు నమ్మకం పోయిందని తమ కామెంట్ల ద్వారా రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోని చూడండి.
Mother elephant stops its child from approaching the tourists.. pic.twitter.com/ASruHsJKnn
— Buitengebieden (@buitengebieden) September 3, 2022