Nidhi Agarwal : హీరోయిన్ నిధి అగర్వాల్ హీరో నాగచైతన్యతో నటించిన ‘ సవ్యసాచి ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ అమ్మడు హైదరాబాద్ లో పుట్టినా పెరిగినదంత బెంగళూరులోనే. ‘ సవ్యసాచి ‘ సినిమా తర్వాత ‘ మిస్టర్ మజ్ను ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకో లేకపోయింది. రెండు ప్లాఫుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ ను అందుకుంది. ఈ సినిమా హిట్ అయిన ఈ అమ్మడు ఎగిరి గంతేస్తుంది అనుకుంటే లైట్ తీసుకుంది. అందాన్ని వెతుక్కుంటూ అవకాశాలు అవే వస్తాయిలే అనుకుంటూ కోలీవుడ్ లోకి వెళ్లి అక్కడ ఓ రెండు సినిమాలను చేసింది.
Nidhi Agarwal : నిధి అగర్వాల్ అసలు ఏమీ తెలియదు అనుకుంటా…
ఆ తర్వాత కొత్త కుర్రాడు అశోక్ గల్లా తో ‘ హీరో ‘ సినిమా చేసింది. ఆ సినిమాను ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. అయినా ఈ అమ్మడు పెద్దగా ఫీల్ అయినట్టు కనిపించలేదు. అలాగే సెట్స్ పై ఉన్న ‘ హరిహర వీరమల్లు ‘ సినిమా గురించి కూడా టెన్షన్ ఆమెలో కనిపించడం లేదు. సాధారణంగా ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అది ఎప్పుడు పూర్తవుతుందా, ఆ సినిమాతో ఏ స్థాయిలో మార్కెట్ పెరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ అలాంటి విషయాలను నిధి పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. పోనీ వేరే ప్రాజెక్టులను ఒప్పేసుకుంటుందా అంటే అదీ లేదు. ఏ కొత్త ప్రాజెక్టులలోను ఆమె పేరు వినిపించడం లేదు. మిగిలిన భాషల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుండటం విశేషం.

నిజానికి ఈ మధ్యకాలంలో వచ్చిన కథానాయకులలో అందచందాల విషయంలో నిధి ముందు వరుసలోనే ఉంటుంది. చక్కని కనుముక్కు తీరుతో చందమామ లాగా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ స్థాయిలో హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇంత లేత అందాలున్నా అవకాశాలం కోసం ఏమాత్రం ప్రయత్నించకపోవడం విశేషం. తనకంటే వెనక్కి వచ్చిన వారు ముందుకెళుతున్న ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్లామర్ ఉండగానే క్రేజ్ సంపాదించుకోవాలి. క్రేజ్ ఉండగానే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అనే విషయం నిధికి తెలియదనుకుంటా అని సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు.