Samantha : ప్రస్తుతం సమంత ఏం చేస్తుంది అనేది సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా సమంత పేరు ఇండస్ట్రీలో ఎక్కడ వినిపించట్లేదు. ఆమె చేస్తున్న రెండో సినిమా యశోద మరియు శకుంతలం అప్పుడు ఇప్పుడు అంటూ రిలీజ్ డేట్లు దాటేసుకొని వస్తున్నారు. సమంత విదేశాలకు వెళ్లి వచ్చి కూడా ఆరు నెలలు దాటిపోయాయి. ప్రస్తుతం సమంత హైదరాబాదులో కూడా లేదని అంటున్నారు. అయితే ఆరు నెలలుగా ఒక వార్త వార్తలలో బాగా వైరల్ అవుతూ ఉంది. అదే ఆమె ఏదో స్కిన్ డిసీస్ తో బాధపడుతున్నట్లుగా ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని సమాచారం.
అంతకుముందు ఆమె హోమాలు పూజలు పూజలు కూడా చేయడం మనసుకు తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ డిసీస్ కి సంబంధించి ఆయుర్వేద వైద్యం కూడా చేయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది. సమంత ఆరోగ్య విషయంలో ఏదో జరుగుతుందన్న సందేహాలు అయితే మాత్రం చాలా మందికి ఉన్నాయి. అంతేకాకుండా ఆమె చేసిన యశోద శకుంతల సినిమాలు అలాగే ఉండిపోయాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాలేదు అంతేకాకుండా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
Samantha: సమంత ఇప్పుడు ఎక్కడ ఉంది…. ఏం చేస్తుంది
తాజా అప్డేట్స్ ప్రకారం సమంత కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తనకు వరుస ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయిందని కాస్త మానసిక ప్రశాంతత కోసమే అక్కడికి వెళ్లినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుసగా ఆమె చేపట్టిన క్రేజీ ప్రాక్టీవ్ ప్రాజెక్టులు సడన్ గా స్లో అవ్వడంతో పలు సందేహాలు వస్తున్నాయి. ఆమె ఈనెల 10న అక్కడ నుంచి తర్వాత డబ్బింగ్ చెప్తేనే అంతా మంచిగా ఉంటుందని లేకుంటే సమంత విషయంలో ఏదో జరిగిపోతుందన్న సందేహాలు సినిమా ఇండస్ట్రీలో బలపడతాయని అంటున్నారు.