Sangeetha : రేయ్ అనిల్ రావిపూడి.. ఇలా చేసావ్ ఏంట్రా నన్ను… అంటూ తిడుతున్న హీరోయిన్…

Sangeetha : సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పై వచ్చిన మాటలు వైరల్ గా మారాయి. ఇటీవల సీనియర్ హీరోయిన్ సంగీత ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చి అనిల్ రావిపూడి పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఏమైందా అని నివ్వెరపోతున్నారు. హీరోయిన్ సంగీత ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి పాపులారిటీ దక్కించుకుంది. తన ట్రెడిషనల్ అందాలతో, కత్తిలాంటి చూపులతో, క్యూట్ స్మైల్ తో యువకులను ఫిదా చేసింది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్న ఈ మధ్యనే సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ఏమాత్రం అందం తగ్గనీయకుండా మంచి ఫిజిక్స్ తో కుర్రాలను కట్టిపడేస్తుంది సంగీత.

Advertisement

సంగీత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘ సరిలేరు నీకెవ్వరు ‘ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.: ఈ సినిమాలో సంగీత రష్మిక మందన తల్లిగా నటించింది. అంతేకాదు రష్మిక తో పోటీపడి అందాల ప్రదర్శన ఇచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటన కన్నా సంగీత నటనే బాగుంది అంటూ జనాలు మెచ్చుకున్నారు. అంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలరు. రీసెంట్ గా మసూదా అనే సినిమాలో ఒక రోల్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా గేమ్ షో కి గెస్ట్ గా వచ్చింది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.

Advertisement

Sangeetha : అనిల్ రావిపూడి ని తిడుతున్నసంగీత…

Heroin Sangeetha comments on Anil ravipudi
Heroin Sangeetha comments on Anil ravipudi

ఆలి ఆమెను అడుగుతూ సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ మదర్ గా చేశారు కదా అది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటూ అడిగారు. దీనికి ఆమె ఈ కథ వినగానే అనిల్ రావిపూడి ని నోటికి వచ్చినట్టు తిట్టేసాను. ఏంట్రా నన్ను ఇలా చేసావ్ అని తిట్టుకున్నాను. అప్పుడేంటి ఇప్పుడు కూడా తిట్టుకుంటున్నాను. ఇకపై కూడా తిట్టుకుంటాను అనిల్ రావిపూడి ని తలచుకుంటుంటే తిట్టకుండా ఉండలేకపోతున్నాను అంటూ సరదాగా కామెంట్ చేసింది. దీనితో అనిల్ రావిపూడి పై సంగీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో సంగీత ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించింది.

Advertisement