Snake Gourd Benefits : పొట్లకాయను తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. పొట్లకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి.పొట్లకాయలో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, అయోడిన్, అండ్ యాంటీ బయటిక్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఇమ్యునిటీని బాగా బూస్ట్ చేస్తాయి వీటిల్లో ఉన్న విటమిన్స్, మినరల్స్. ఆకలి వేయని వాళ్లకి, మోకాలు నొప్పి ఉన్నవాళ్లకి, విపరీతమైన తలనొప్పి ఉన్నవాళ్లకి, నిద్ర లేకపోవడానికి,నెగెటివ్ ఆలోచనలు ఉన్న వారికి,జరిగిన విషయాన్ని పదే పదే తలుచుకుని ఆలోచించే వారికి ఈ పొట్లకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి, దంత సంరక్షణ కి ఈ పొట్లకాయ ఎంతగానో దోహదపడుతుంది.
అంతే కాదు పొట్లకాయ అనేక వ్యాధుల నివారణకు దోహదపడుతుందని, వాంతులు, విరేచనాలతో కూడిన జ్వరానికి పొట్లకాయ మంచి ఔషధంగా పనిచేస్తుందని, సంప్రదాయ వైద్యం పేర్కొంటోంది. మలేరియా జ్వరాల బాధితులకు పొట్లకాయ రసం మంచి మందు, ఇది యాంటీ బయోటిక్గా పని చేస్తుంది అని అనేక ఆధునిక దేశాల్లోనూ తేలింది. చైనా సంప్రదాయ వైద్యం ప్రకారం మధు మేహానికి పొట్లకాయ అద్భుత ఔషధంలా పని చేస్తుందట, పైగా క్యాలరీలు కూడా తక్కువ కావడంతో బరువు తగ్గుతారు.ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి కూడా పొట్లకాయ తోడ్పడుతుంది.అందుకే దీని నుంచి తీసిన రసం రోజూ రెండు కప్పుల తాగితే, బీపీని తగ్గిస్తుంది. పొట్లకాయ శరీరంలోని టాక్సిన్లను సమర్ధవంతంగా తొలగిస్తుంది.
Snake Gourd Benefits : పొట్లకాయను తినడం వలన కలిగే లాభాలు మీ కోసం

మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తుంది. గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు, శ్వాస వ్యవస్థ పనితీరుకు దోహదపడుతుంది. పొట్లకాయ రసాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత స్నానం చేస్తే తలలో ఉన్న చుండ్రు తగ్గుతుంది.జ్వరం తగ్గాక, ఆరోగ్యకరమైన ఆహారం అవసరమంటూ కొద్ది రోజుల పాటు పత్యoగా ఇచ్చే కూరల్లో, పొట్లకాయ ఒకటి. దాని విశిష్టత ఏమిటన్నది ఈ ఉదాహరణతోనే తెలుస్తుంది. పొట్లకాయ డయాబెటిస్ ను నివారిస్తుంది. అంతేకాదు, చైనీస్ పొట్లకాయను డయాబెటిస్ చికిత్స కోసం వినియోగిస్తూ ఉంటారు.
ఇందులో క్యాలరీస్ తక్కువ కాబట్టి, డయాబెటిస్ రోగులు దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.గుండె దడ వంటి గుండె జబ్బులను పొట్లకాయ సమర్థవంతంగా నిరోధిస్తుంది. గుండెపై ఒత్తిడి తొలగించి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే గుణం పొట్లకాయలో ఉంది. కామెర్ల వంటి వ్యాధులు వచ్చి కోరుకుంటున్నవారు పొట్లకాయను తినడం వల్ల కాలేయం మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది.ఇలా కాలేయం త్వరగా కోలుకునేలా పొట్లకాయ తోడ్పడుతుంది. పొట్లకాయలో అన్ని రకాల ఖనిజ, లవణాలుంటాయి. ఎన్నో సూక్ష్మ పోషకాలను మైక్రోన్యూట్రియంట్స్ను సమకూర్చే అద్భుత ఆహారం ఇది.