Chicken Vadalu : : చాలామంది చిరుతిళ్ల తినడానికి ఇష్టపడతారు. మన కిచెన్ రూమ్ లో ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేస్తాం. ఇటువంటి వాటిల్లో ఒకటి చికెన్ వడలు, మసాలా వడ, అటుకులు వడ ,మినప వడ ఇలా ఎన్నో రకాల వడలు చేస్తుంటాం. ఇవే కాకుండా చికెన్ తో కూడా వడలు తయారు చేసుకోవచ్చు. చికెన్ తో తయారు చేసుకునే వడలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ వడలు ఎలా తయారు చేసుకోవాలో మరియు వాటి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం.
అరకప్పు నానబెట్టిన సెనగపప్పు, బోన్ లెస్ చికెన్ 250 గ్రాములు, సన్నగా తురిమిన పచ్చిమిర్చి ఐదు, చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు, కరివేపాకు రెబ్బలు 4, 5, ఒక కప్పు కొత్తిమీర తరుగు, ఉప్పు టెస్ట్ కు సరిపడా, చిటికెడు పసుపు, కారం రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, బియ్యం పిండి ఒక కప్పు, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా, ఇప్పుడు చికెన్ వడలు తయారీ విధానం తెలుసుకుందాం.ముందుగా నానబెట్టిన శనగపప్పుని తెల్లటి క్లాత్ సహాయంతో పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తరువాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అక్కడ అక్కడ పప్పు పలుకులు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
Chicken Vadalu : : చికెన్ వడలు ఈ విధంగా చేస్తే…

దానిని వేరే బౌల్లో వేసుకోవాలి . అదేవిధంగా అదే మిక్సీ జార్ లో బోన్లెస్ చికెన్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా బౌల్లో వేసుకొని మిగిలిన ఇంగ్రిడియంట్స్ అన్ని ఏసీ బాగా కలిపి కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తరువాత కాటన్ వైట్ క్లాత్ తడి చేస్తూ దానిపైన రౌండ్ గా చేసుకోవాలి. ఈ వడలు మరీ పల్చగా కాకుండా ,మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులో వేసి మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొద్దిసేపు టిష్యూ పేపర్స్ లో వేసి ఉంచాలి. ఇలా తయారు చేసిన వడలను స్నాక్స్ గా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి.