Samantha : సమంత ఆ మూవీ మహేష్ తో చేసుంటే.. ఆమె కెరీర్ ఇంకొకలా ఉండేది…

Samantha : పరిచయం అక్కర్లేని పేరు సమంత. ఈ అమ్మడు వరుస మూవీలతో కొన్ని యాడలతో ఎంతో బిజీగా మారింది. ఈ అమ్మడు నటిగా చాలా అవార్డులను కూడా అందుకుంది. కెరియర్ పరంగా ఎంతో ఫేమస్ అయింది. కానీ పెళ్లి విషయంలో ఆమె సక్సెస్ అవ్వలేకపోయింది. నాగచైతన్య లవ్ చేసి వివాహం చేసుకున్న సమంత అతడితో ఎక్కువ రోజులు జీవితం గడప లేక పోయింది. పెళ్లయి నాలుగు సంవత్సరాలు అవ్వకముందే వీళ్ళు డైవర్స్ తీసుకుని అభిమానులకి షాక్ ఇవ్వడం జరిగింది. వీరిద్దరికీ 2017 మూవీలో మొదటి పరిచయం జరిగింది. ఈ మూవీలో వీళ్ళ క్యారెక్టర్లు కార్తీక్, జెస్సి ఎంతో గొప్పగా నటించారు. వీళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ పై ప్రేక్షకులని బాగా నచ్చింది.

ఇక సూపర్ సక్సెస్ మూవీతో పరిచయమే వీళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారి వివాహం వరకు వెళ్ళింది. వీరిద్దరి ఫ్యామిలీలు కూడా ఒప్పుకోవడంతో 2017లో గోవా వేదికపై ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ బాగా సన్నిహితుల మధ్య వేళ్ళ పెళ్లి సాంప్రదాయంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజుల వరకు వీళ్ళ జీవితం సాఫీగానే సాగింది. వీళ్ళిద్దరి మధ్య కొన్ని వివాదాలు కారణంగా డైవర్స్ తీసుకుని దూరంగా వెళ్లిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా రన్ అవుతోంది. దీనిని పక్కన పెడితే వీరిద్దర పరిచయానికి కారణమైన మూవీ ఏం మాయ చేసావే దీని గురించి డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు.

Samantha : సమంత ఆ మూవీ మహేష్ తో చేసుంటే..

If Samantha was doing that movie with Mahesh
If Samantha was doing that movie with Mahesh

ఏం మాయ చేసావే మూవీ మొదటి ఛాయిస్ నాగచైతన్య కాదట. గౌతమ్ మీనన్ ముందుగా ఈ మూవీని టాలీవుడ్ ఫ్రెండ్స్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారట. మహేష్ బాబుకి స్టోరీ కూడా వినిపించారట. అయితే మహేష్ ఇటువంటి లవ్ స్టోరీ కాకుండా ఇంకేదైనా యాక్షన్ స్టోరీ ఉంటే చేస్తాను. అన్నట్లుగా చెప్పాడట. అప్పుడు నాగచైతన్య ని తీసుకున్నారట. అయితే ముత్తు మూవీ ప్రమోషన్లలో ఎపిసోడ్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. అయితే అప్పుడు మహేష్ బాబు ఏం మాయ చేసావే చేసి ఉంటే మూవీ ఫలితం ఏ విధంగా ఉన్నా.. నాగచైతన్యతో లవ్ వివాహం డైవర్స్ సమంతా కి తప్పేవేమో ఆమె జీవితం ఇంకొక విధంగా ఉండేది అని అభిమానులు అభిప్రాయం.