Viral Video : నేటి జనరేషన్ యూత్ కు తాము చదివే సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో కూడా తెలియదు కానీ.. సోషల్ మీడియా గురించి అడిగితే మాత్రం టక్కున చెప్పేస్తారు. సోషల్ మీడియాకు ఉన్న పాపులారిటీ అటువంటిది మరి. ఇప్పుడు కొత్తగా రీల్స్ అంటూ అందరూ దాని మీదనే పడుతున్నారు. ఫేస్ బుక్ లో చూసినా రీల్సే.. ఇన్ స్టాగ్రామ్ లో చూసినా రీల్సే. ఎక్కడ చూసినా రీల్సే. ముఖ్యంగా యువతులు అయితే రీల్స్ చేయకుండా నిద్రపోరు. మంచి డ్రెస్ వేసుకున్నా.. రెడీ అయినా వెంటనే ఒక రీల్ చేయాల్సిందే.

కొందరు రీల్స్ కోసం సాహసాలు కూడా చేస్తుంటారు. సాహసాలు చేయడం మాత్రమే కాదు.. తమ లైఫ్ ను రిస్క్ లో పెడతారు కొందరు. అలా రీల్స్ కోసం, సెల్ఫీల కోసం చాలామంది తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. అలాంటి ఘటనలను ఎన్నో చూశాం మనం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ యువతి రీల్స్ కోసం ఏం చేయబోయి ఏం చేసిందో చూస్తే నోరెళ్లెబడతారు.
Viral Video : నీళ్లలో సరదాగా గడపబోయి అడ్డంగా బుక్కయింది
ఓ యువతి నీళ్లను చూసి ఆగలేకపోయింది. నీళ్లు అంటే అందరికీ ఇష్టమే కదా. అందుకే ఆ నీళ్లలోకి వెళ్లి సరదాగా కాసేపు ఆడుకుంది. ఎలాగూ చేతుల్లో ఫోన్ ఉంటుంది కదా.. తనతో వచ్చిన వాళ్లను వీడియోలు, ఫోటోలు తీయమని చెప్పి ఇక తన లోకంలో తాను ఉండిపోయింది. అక్కడ చుట్టూ తిరుగుతూ కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్లింది. అక్కడ కాలు పెట్టింది. అంతే.. ఒక్కసారిగా నీళ్లలో పడిపోయింది. అక్కడ లోతుగా ఉందని తెలియక కాలు పెట్టి అడ్డంగా బుక్కయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు పాపా.. వీడియో కోసం ఇన్ని కష్టాలు అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.